కృష్ణ

ప్రతి పేదకీ కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, డిసెంబర్ 13: రాష్ట్రంలో ప్రతి పేదవానికీ కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. మండలంలో సిఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.6లక్షల 31వేల చెక్కులను లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. పేద వారికి కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఎన్‌టిఆర్ ఆరోగ్య పథకం కింద 1028 జబ్బులకు కార్పొరేట్ వైద్యశాలలో ఉచితంగా వైద్యసేవలు అందించడం జరుగుతొందన్నారు. ప్రతి పేద వారు వీటిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ కర్ల వెంకట నారాయణ, జడ్‌పిటిసి గింజుపల్లి శ్రీదేవి, డిసి చైర్మన్ వేగినేటి గోపాలకృష్ణ మూర్తి, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు వెల్ది శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్‌బాబు, తెదేపా నేతలు ఊట్ల నాగేశ్వరరావు, నల్లపునేని వెంకట నారాయణ, లగడపాటి వెంకటేశ్వరరావు, కర్ల నాగేశ్వరరావు, కాకాని హరిబాబు, నూతలపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైసిపి, టిడిపి మధ్య ముదురుతున్న ఆధిపత్యపోరు
* మధ్యలో నలుగుతున్న అధికారులు
పెడన, డిసెంబర్ 13: పట్టణంలో అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి మధ్య ఆధిపత్యపోరు ముదురు పాకాన పడుతోంది. ఇటీవల జరిగిన అధికార మార్పిడి నేపథ్యంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. మంగళవారం ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సమక్షంలోనే ఇరువర్గాలు బాహాబాహి తలపడేంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరికొకరు హెచ్చరికలు చేసుకున్నారు. వైసిపికి చెందిన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్‌కు మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సోదరుడు రామమూర్తికి మధ్య వాగ్వివాదం తీవ్ర స్థాయిలో జరిగింది. 3వ వార్డులో డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి పని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సమక్షంలోనే వీరిరువురు దూషించుకున్నారు. కొబ్బరికాయ కొట్టే విషయంలో వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది. ప్రొటోకాల్ పాటించటం లేదంటూ చైర్మన్ ప్రశ్నించటంతో వివాదం నెలకొంది. దీంతో నువ్వేంతంటే.. నువ్వేంతంటూ సవాళ్లు విసురుకున్నారు. ఇలా ఉండగా వీరిద్దరి గొడవకు ముందు మున్సిపల్ కమిషనర్ మనె్నం గోపాలరావుతో కూడా మున్సిపల్ చైర్మన్‌కు వివాదం చోటుచేసుకుంది. వీరిద్దరి మధ్య కూడా వాగ్వివాదం తీవ్ర స్థాయిలో జరిగింది. శ్రీ పైడమ్మ సంబరాలకు బ్యానర్లు ఏర్పాటు చేసే విషయంలో ప్రొటోకాల్ అంశం దీనికి కారణమైంది. ప్రతి దానికీ తనను అవమానిస్తున్నారంటూ చైర్మన్‌పై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువగా మాట్లాడవద్దని చైర్మన్ అనగా మీకంటే నేను ఎక్కువగా మాట్లాడగలను అని కమిషనర్ సమాధానమిచ్చారు. ఏదైనా ఉంటే ఛాంబర్‌లో మాట్లాడుకుందామని చైర్మన్ అన్నారు. ఈ రెండు గొడవలను ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు, ముఖ్య ప్రజాప్రతినిధులు చూస్తూ ఉండిపోయారు.