కృష్ణ

వార్ధాతో కానిస్టేబుల్స్ ఫిట్‌నెస్ పరీక్షలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 13: వార్ధా తుఫాన్ కారణంగా మంగళవారం కురిసిన ఓ మోస్తరు వర్షానికి గాను జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షం కారణంగా పెరేడ్ గ్రౌండ్ మొత్తం చిత్తడి చిత్తడిగా మారటంతో మంగళవారం, బుధవారం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్‌కుమార్ తెలిపారు. ఈ రెండు రోజులు జరగాల్సిన పరీక్షలను 18, 19తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. గురు, శుక్ర, శనివారాల్లో జరగాల్సిన పరీక్షలు యథా విధిగా జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు 08672-252900, 252090, 9440796404, 9440796476, 9440904700, 9848476899 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఎస్పీ విజయ్‌కుమార్ కోరారు. ఇదిలా ఉండగా మంగళ, బుధవారాల్లో జరగాల్సిన ఫిట్‌నెస్ పరీక్షలు వాయిదా పడటంతో ఇతర జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వార్ధా హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే వాయిదా వేసి ఉంటే బాగుండేదని, ఇప్పుడు తాము తమ తమ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ రావాలంటే అధిక వ్యయ ప్రయాసలు పడక తప్పదని పలువురు వాపోయారు.

కొనసాగుతున్న ‘నోట్ల’ గండం
* వరుస సెలవుల అనంతరం తెరుచుకున్న బ్యాంక్‌లు
* నగదు కోసం బారులు తీరిన ప్రజానీకం
* కనీస ఏర్పాట్లలో విఫలమైన బ్యాంకర్లు

మచిలీపట్నం, డిసెంబర్ 13: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వార్ధా’ తుపాను గండం సమసినా ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన ‘నోట్ల’ గండం కొనసాగుతూనే ఉంది. గత నెల రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు ఏ మాత్రం తీరడం లేదుకదా మరింత పెరుగుతున్నాయి. మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం బ్యాంక్‌ల వద్ద ప్రజలు బారులు తీరారు. అన్ని వర్గాల ప్రజలు బ్యాంక్‌ల బాట పట్టారు. నగదు కోసం గంటల తరబడి క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు. వృద్ధులు సైతం బ్యాంక్‌ల వద్ద ఇబ్బందులు పడ్డారు. వరుస సెలవుల అనంతరం బ్యాంక్‌లకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ అధికారులకు తెలిసినప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లను చేయడంలో విఫలమయ్యారు. బ్యాంక్‌ల వద్ద ఎటువంటి షామియానాలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించకపోవటంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో నిలువ నీడ లేక ప్రజలు నానా ఇక్కట్లకు గురయ్యారు. తాగేందుకు గుక్కెడు నీరు లేక అలమటించారు. వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అన్ని బ్యాంక్‌ల వద్ద ఈ పరిస్థితి కనిపించింది. గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడినా అవసరాల మేర నగదు పొంద లేకపోయారు. నగదు కొరత కారణంగా బ్యాంకర్లు రూ.2వేలు మించి ఇచ్చిన పాపాన పోలేదు. కొన్ని బ్యాంక్‌ల్లో మాత్రమే రూ.5వేలు వరకు ఇచ్చారు. అది కూడా మధ్యాహ్నం వరకు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికీ రూ.2వేలు ఇచ్చి కన్నీళ్ళు తుడిచారు. ఉదయం అంతా బ్యాంక్‌ల వద్ద ఆ రూ.2వేలు కోసం క్యూ కట్టిన ప్రజానీకం సాయంత్రం నుండి ఎటియంల వద్ద బారులు తీరారు. అన్ని ఎటియంలు పని చేయకపోయినా పని చేసిన ఒకటి రెండు చోట్ల మాత్రం ప్రజలు భారీగా బారులు తీరారు. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగదు నిల్వలు పెంచకపోయినా బ్యాంక్‌లు, ఎటియంల వద్ద పోలీసు బందోబస్తును మాత్రం పెంచారు. ఏది ఏమైనా మూడు రోజుల సెలవుల అనంతరం కొంత మేరైనా కరెన్సీ కష్టాలు తీరుతాయని ఆశించిన ప్రజలకు చేదు అనుభవమే ఎదురైంది. కరెన్సీ కష్టాలు షరామామూలై పోయాయి.

నగదు కోసం బ్యాంకుల వద్ద ఖాతాదారుల బారులు
* నగదు ఉపసంహణలో పరిమితిపై ప్రజల అసంతృప్తి
జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 13: మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం తెరుచుకున్న బ్యాంకుల ముందు ప్రజలు నగదు కో సం బారులు తీరారు. బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుందని ఊహించిన చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ బందోబస్తుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు చిల్లకల్లు యాక్సిస్, ఎస్‌బిఐ బ్యాంకుల ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్‌లో పంపించే ఏ ర్పాట్లు చేశారు. బ్యాంకులు తెరిచే సమయానికే నగదు కోసం ఖాతాదారులు, ప్రజలు వేచి ఉన్నారు. యాక్సిస్ బ్యాం క్ లోపల భారీ రద్దీ నెలకొనగా ఎస్‌బి ఐ ఎదుట పెద్ద ఎత్తున క్యూలైన్‌లో ఖా తాదారులు వరుస కట్టారు. విత్‌డ్రాపై బ్యాంకు అధికారులు పరిమితి విధించడంతో చాలామంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.4వేలు మా త్రమే డ్రా చేసుకునే అవకాశం, అవి కూడా రూ.2వేల నోట్లు ఇవ్వడం వల్ల చిల్లరలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమ ఖాతాలో ఉన్న సొమ్ములను కూడా తీసుకోవడానికి పరిమితి ఏమిటి అని క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన ఖర్మ ఏమిటని ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎటిఎంలో మాత్రం నగదు ఉంచకపోవడం వల్ల అవి పని చేయలేదు.

అభివృద్ధికి చిరునామా టిడిపి ప్రభుత్వం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 13: అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి రవీంద్ర మంగళవారం స్థానిక 40, 41వ వార్డులలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 41వ వార్డులో ఎన్‌జిఓ హోమ్ ఎదుట రూ.8.25లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను మంత్రి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలుజరుగుతున్నాయో పరిశీలించేందుకు వార్డులలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పథకాల అమలులో లోటుపాట్లను తెలుసుకుని వాటిని మరింత పటిష్టవంతం చేసి నిరుపేదలకు అందించటమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడుకు తోడుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా శ్రమిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో టిడిపి ప్రజలతో ఉంటూ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తుందన్నారు. రుస్తుంబాదలో అల్లంకి నాగ పుష్పావతి అనే వృద్ధురాలు పక్కా గృహం కావాలని మంత్రిని కోరగా గృహాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. 40వ వార్డు కాపు సంఘం దొడ్డి బజారులో పరసా నాగబాబు(50) ఈనెల 10న మృతి చెందగా చంద్రన్న బీమా కింద మృతుని భార్య అమలేశ్వరికి రూ.5వేల నగదును మంత్రి రవీంద్ర అందించారు. మరో రూ.25వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఈడేపల్లి నారాయణపురం యానాదుల కాలనీకి చెందిన ప్రజల ఇళ్లు శిథిలావస్థకు చేరటంతో శ్లాబ్‌ల నుండి వర్షం నీరు కారుతుందని మంత్రికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకుడు కొనకళ్ళ జగన్నాధరావు(బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కౌన్సిలర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, పామర్తి రాధిక, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

కోతుల బెడదతో రైతన్నల ఆందోళన
కూచిపూడి, డిసెంబర్ 13: మొవ్వ మండలం చినముత్తేవి, కారకంపాడు గ్రామాలలో కోతుల బెడదతో రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం కోతుల దండు ఒక్కసారిగా గ్రామ శివారు ప్రాంతంలోని పొలాల్లో గట్లపై వేసిన కూరగాయల పాదులను ధ్వంసం చేయటంతో రైతులు సంఘటితంగా టపాసుల మోతలతో తరిమికొట్టారు.