కృష్ణ

గడ్డమణుగులో ఎపిఫైబర్‌గ్రిడ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, డిసెంబర్ 15: మండల పరిధిలోని గడ్డమణుగులో ఎపి ఫైబర్‌గ్రిడ్ ద్వారా ప్రజలకు సేవలు ప్రారంభమయ్యాయి. గడ్డమణుగు కేబుల్ ఎంఎస్‌ఒ నూతక్కి రాజా ఈ సేవలను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. టిడిపి మండల కార్యదర్శి గొల్లపూడి నళినీమోహన్‌తో పాటు పలువురికి ఫైబర్‌గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్, ల్యాండ్‌లైను ఫోను, వైఫై సౌకర్యాలను కల్పించారు. ఇందుకోసం ప్రజలు సెట్‌టాప్ బాక్సు, వైఫై మోడెం కోసం డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ప్రతినెలా కేవలం 149 రూపాయలతో ఆయా సేవలను పొందవచ్చు. ఇంటర్నెట్ 15 ఎంబిపిఎస్ స్పీడు వస్తుండగా, కేబుల్ ద్వారా టివి ఛానళ్ళు హెడ్‌డి క్వాలిటీటో ప్రసారం అవుతున్నాయి. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొల్లపూడి నళినీమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం ఎపి ఫైబర్‌గ్రిడ్ ద్వారా నాణ్యమైన, మెరుగైన సేవలను అతితక్కువ ఖర్చుకే అందించడంలో సిఎం నారా చంద్రబాబునాయుడు చొరవ అనిర్వచనీయమని కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి నుంచే ఈసేవ సౌకర్యం, ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారం లభించనున్నాయన్నారు. ప్రభుత్వ సర్వేల్లో కూడా దీని ద్వారా పాల్గొనవచ్చు. బహుళ ప్రయోజనాలు కలిగే ఈ సేవలను అన్ని గ్రామాల్లో అందుబాటులో తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిగిలిన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి - చైర్మన్ బాబాప్రసాద్
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 15: విద్యార్థులు క్రీడాల్లో రాణించాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. స్థానిక ఇనగుదురుపేట నాగార్జున పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో గురువారం ఎస్‌విఎస్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నీకాయిట్, షటిల్ టోర్నమెంట్ పోటీలను అప్స రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి కె చంద్రశేఖర్ ప్రారంభించారు. బహుమతి ప్రదానోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం, ఆరోగ్యం కలుగుతాయన్నారు. అనంతరం విజేతలకు చైర్మన్ బహుమతులు అందించారు. 28 విద్యా సంస్థలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. టెన్నీకాయిట్ పోటీల్లో విన్నర్స్‌గా రుస్తుంబాదా మున్సిపల్ హైస్కూల్, రన్నర్స్‌గా చిన్నాపురం కేరళ పబ్లిక్ స్కూల్ టీములు నిలిచాయి. షటిల్ విన్నర్స్‌గా గాంధీ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, రన్నర్స్‌గా రుస్తుంబాదా మున్సిపల్ హైస్కూల్ టీములు నిలిచాయి. ఈ పోటీలను వి సుందరరాం, టి ఏడుకొండలు, విఎన్ ప్రవీణ్ తదితరులు పర్యవేక్షించారు.