కృష్ణ

గతేడాది కంటే తగ్గిన పాడి పశువుల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, డిసెంబర్ 15: జిల్లాలో పాడి పశువుల పెంపక స్థాయి గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గిందని, గత ఏడాది 6లక్షల 90వేల పాడి పశువులు ఉండగా ఈ ఏడాది 6లక్షల 10వేలకు తగ్గిపోయాయని జిల్లా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, ఇన్‌ఛార్జి జెడ్పీ సిఇఓ దామోదర నాయుడు తెలిపారు. పామర్రు మండలం కొమరవోలులో జెడ్పీ పనులను గురువారం ఆయన పరిశీలించటానికి వచ్చి విలేఖర్లతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్న పాత్రుడు మండలంలో పర్యటించినప్పుడు కొమరవోలులో పంచాయతీ భవనం, కమ్యూనిటీ హాలు, పశు వైద్యశాలకు నూతన భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని గ్రామస్థులు దరఖాస్తులు చేసుకున్నారని, ఆయా దరఖాస్తుల సమస్యలను పరిశీలించడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ పేదలు పశువులు, కోళ్ళు, మేకల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పాడి పశువులకు విరివిగా ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ సమస్యలను ఆ గ్రామానికి చెందిన జెడ్పీటిసి పి శశి, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పి కృష్ణబాబు సిఇఓకు వివరించారు.

వెయిట్ లిఫ్టింగ్‌లో ఎల్బీఆర్సీఇ విద్యార్థుల ప్రతిభ

మైలవరం, డిసెంబర్ 15: జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో స్థానిక ఎల్బీఆర్సీఇ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ ఈ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో జరిగిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తమ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి శిల్ప 75 కిలోల విభాగంలో ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా మెకానికల్ తృతీయ ఏడాది చదువుతున్న ఆరిఫ్ 105కిలోల విభాగంలో ద్వితీయ స్థానం, ఏరోస్పేస్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థి 50 కిలోల విభాగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులను వీరికి శిక్షణ ఇచ్చిన కోచ్ విక్రంను, పిడి రాజ్‌కుమార్‌లను కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ ప్రసాద్, ఏంబీఏ విభాగాధిపతి ఆదిశేషారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు అభినందించారు.

తెలుగువారి గుండెల్లో అమరజీవి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 15: ఆంధ్ర రాష్ట్రం కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 63వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కోర్టు సెంటరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ మతీన్, ఆర్యవైశ్య ప్రముఖులు కూరాళ్ళ రామచంద్రరావు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి ప్రసాద్, బుల్లెట్ ధర్మారావు, ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయ
అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కామినేని
కలిదిండి, డిసెంబర్ 15: స్థానిక శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రహరీగోడ, మంచినీటి పైపులు, వాటర్ ట్యాంక్, మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అభివృద్ధి పనులను చురుగ్గా చేయిస్తున్న ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాస్‌ను మంత్రి అభినందించారు. సుమారు రూ.25లక్షలు ఖర్చు అవుతుందని గ్రామస్థులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కార్యదర్శి సామర్ల శివకృష్ణ, మండల బిజెపి అధ్యక్షుడు గుర్రాల శ్రీరామమూర్తి, మండల టిడిపి అధ్యక్షుడు పోకల జోగిరాజు, ఎంపిపి బండి లక్ష్మి, జెడ్పీటిసి నున్నా రమాదేవి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభనేని శ్రీనివాస చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.