కృష్ణ

మాకు రహదారి సౌకర్యం కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టే నిర్మాణాలు యాత్రికులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులు ప్రతిపాదించిన పనులకు రూపొందించిన అంచనాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఆయన ఆదేశించారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ల వద్ద ప్రతిపాదించిన పనుల అవసరాన్ని అంచనా వేసేందుకు కలెక్టర్ బాబు అదనపు పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిథిలోని పుష్కర స్నాన ఘట్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది అధికారులు 3 ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి, ఘాట్లను సందర్శించారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగర పరిధిలోని పుష్కర ఘాట్లను యాత్రికుల రద్దీకి తగిన విధంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వల్లూరిపాలెం, నార్త్ వల్లూరు గ్రామానికి గ్రావెల్ రోడ్డు నిర్మించాల్సిందిగా ఆ గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు కలెక్టర్ బాబు.ఎ కు విజ్ఞప్తి చేశారు. రహదారి సౌకర్యం లేక ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నార్త్ వల్లూరు గ్రామానికి నది మధ్య కొంత ప్రాంతం మీదుగా రహదారి నిర్మించాల్సి ఉన్న దృష్ట్యా దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ ఎస్‌ఇ సూర్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. విజయవాడ నుండి కరకట్ట రోడ్డుపై బస్సు సౌకర్యం కల్పించాలని దేవరపల్లికి చెందిన ప్రజలు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కరకట్ట రహదారి వాహనాల రాకపోకలకు అనువైనవి కాదని, అయితే మినీ బస్సు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు చెప్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. రొయ్యూరులో ఇసుక యూనిట్‌కు 4 వేలు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రొయ్యూరులోని ఇసుక రీచ్ ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేసేందుకు కేటాయించినట్లు స్థానిక అవసరాలకు సమీపంలోని వేరొక రీచ్ పరిశీలించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో వినియోగదారులకు ఇసుక ఉచితంగా లభించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేయ్యాలని స్థానిక రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తోట్లవల్లూరు ప్రజలు తమ సొంత అవసరాలకు ఇసుక దొరకడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. వాల్టా చట్టం పరిధిలోకి రాని ప్రాంతాన్ని గుర్తించి ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ సృజన, అసిస్టెంట్ కలెక్టర్ సలోని సుడాన్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, డిసిపి ఎల్.కాళిదాసు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వైఎస్ సుధాకర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రామకృష్ణ, ఆర్ అండ్ బి ఎస్‌ఇ శేషుకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డి.చంద్రశేఖర్ రాజు, జిల్లా అటవీ అధికారి అశోక్‌కుమార్ పాల్గొన్నారు.