కృష్ణ

డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, డిసెంబర్ 16: స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే బిసి గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం మచిలీపట్నం డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు పాఠశాల ప్రధానాచార్యుడు పివి నారాయణ ప్రారంభించారు. డివిజన్ స్థాయిలోని 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల పిఇటి, ఆటల పోటీల కన్వీనర్ కెవి సత్యనారాయణ ఆధ్వర్యంలో అండర్-17, అండర్-14 విభాగాలలో వేర్వేరుగా డివిజన్ స్థాయి వాలీబాల్ జట్లను ఎంపిక చేశారు. అండర్-17 విభాగంలో వాలీబాల్ బాలికల జట్టును ఎంపిక చేశారు. ఈ ఎంపికైన వాలీబాల్ జట్లు ఈనెల 21వ తేదీ విజయవాడ పడమట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనన్ను జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో పిఇటిలు కె పూర్ణచంద్రరావు, ఆంజనేయులు, డి భాష్యం, కె రాజేంద్రకుమార్, డి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

20 నుండి గుడ్లవల్లేరులో
రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్
గుడ్లవల్లేరు, డిసెంబర్ 16: స్థానిక ఎఎఎన్‌ఎమ్ అండ్ వివిఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 20, 21, 22తేదీల్లో రాష్ట్ర స్థాయి అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల 21వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వి రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌కు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సందర్భంగా చదరంగం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, త్రిబుల్ జంప్, హై జంప్, డిస్క్‌త్రో తదితర పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 1100 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. 20వతేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ సలహాదారు సుమిత్రా దావ్రా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ జియస్ పాండాదాస్ హాజరు కానున్నట్లు తెలిపారు. 22వతేదీన జరిగే ముగింపు సభలో ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ పాల్గొనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కళాశాల సహాయ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ, మెకానికల్ విభాగాధిపతి ఎన్‌వికె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై సదస్సు
బంటుమిల్లి, డిసెంబర్ 16: హుస్సేన్‌పాలెం హర్ష విద్యా సంస్థల డైరెక్టర్ అంకెం అమల కమలాకరరావు ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం మండల పరిధిలోని అర్తమూరు గ్రామంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించారు. శిబిరంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. నగదు రహిత లావాదేవీల వలన పారదర్శకత ఉంటుందని, అవినీతి నిర్మూలన, నల్లధనం రూపుమాపేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వి వీర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎహెచ్‌ఎస్ నాగమల్లేశ్వరరావు, హెచ్‌ఎం బి సుబ్రహ్మణ్యం, పి వెంకటేశ్వరరావు, పిఇటి కె శ్రీనివాసరావు, బి సంజీవ్ కుమార్, మణికంఠ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె సురేష్, వీరంకి తపోధనరావు తదితరులు పాల్గొన్నారు.