కృష్ణ

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, డిసెంబర్ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపిపి వలవల సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని కొమాళ్ళపూడి పిఎసిఎస్‌లో శుక్రవారం ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. సొసైటీ అధ్యక్షుడు ముత్యాల వెంకట రమణ మాట్లాడుతూ ఎన్నికల వాగ్ధానాల్లో రైతుల రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. రైతులు కోసం పిఎసిఎస్‌లలో సబ్సిడీపై ఎరువులు, మినుములు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ వెంకటరత్నం, మాజీ ఎఎంసి ఛైర్మన్ కూనసాని గరుడప్రసాద్, సర్పంచ్ కె అరుణకుమారి, కె సత్యనారాయణ, నీలిపూడి నీటి సంఘం అధ్యక్షుడు పుప్పాల చిట్టాబాబు, మండల విఆర్‌ఎల సంఘం అధ్యక్షుడు శ్రీను, రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను ఎస్సీలు సద్వినియోగం చేసుకోవాలి
మైలవరం, డిసెంబర్ 16: ప్రభుత్వ పథకాలను ఎస్సీలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పోరేషన్ ఈడి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎస్సీల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎస్సీలకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు రకాల రుణాలను చదువుకోని నిరుద్యోగులకు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకు వారి చదువును బట్టి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులలో సైతం శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ రైతులకు సైతం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూమి ఉన్న రైతుల పొలాలను ప్రభుత్వమే బాగు చేయించి అందులో బోర్లు వేయించి మోటారు సైతం 90శాతం సబ్సీడీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈపథకాలను ఎస్సీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఏఈఓ లావణ్య, ఎంపిడిఓ వై హరిహరనాధ్ పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి ఆటలో పోటీల్లో
పులిగడ్డ గురుకుల విద్యార్థుల ప్రతిభ
అవనిగడ్డ, డిసెంబర్ 16: మండల పరిధిలోని పులిగడ్డ గురుకుల విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా కొడిగనహల్లి గురుకుల విద్యాలయంలో నిర్వహించిన ఆటల పోటీల్లో రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కాగా పులిగడ్డ విద్యార్థులు ఖోఖోలో విన్నర్స్‌గా నిలవగా, కబడ్డీ, టెన్నీకాయిట్, బాల్ బ్యాడ్మింటన్, చెస్‌లలో రన్నర్స్‌గా నిలిచారు. మొత్తం ఐదు అంశాలలో విజయం సాధించటంతో రాష్ట్ర ఛాంపియన్‌షిప్ కైవసమైంది. విజేతలైన విద్యార్థులను ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, పిఇటి వీర కుమార్ అభినందించారు.
అంగరంగ వైభవంగా శ్రీ తులసి, శ్రీకృష్ణుల కల్యాణం
కూచిపూడి, డిసెంబర్ 16: మొవ్వ మండలం బార్లపూడి గ్రామంలో వేంచేసిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం తులసి, శ్రీకృష్ణుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. యజ్ఞ కేసరి ఆచార్య దీవి రామకృష్ణ పర్యవేక్షణలో దీవి గోపాలాచార్యుల బ్రహ్మత్వంలో కోనేరు రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ దంపతులు పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన హోమం, లక్ష్మీశాంతి హోమం నిర్వహించారు. అంతకుముందుగా ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాంతి కల్యాణం, అన్నసమారాధనలో రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రవాస గ్రామస్థులు వేలాది మంది పాల్గొన్నారు.