కృష్ణ

కరెన్సీ పరిస్థితులు జనవరికి మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, డిసెంబర్ 18: జనవరి నాటికి కరెన్సీ పరిస్థితులు చాలా వరకు మెరుగుపడే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టీకరించారు. ఆదివారం ఉదయం ఆత్కూరు స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున నల్ల ధనాన్ని వెలికితీసి అవినీతిని అంతమొందించాలనే ధ్యేయంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని పెద్దనోట్లు రద్దు చేసినట్లు ఆయ న తెలిపారు. 2014 ఎన్నికల వాగ్దానం మేరకే నోట్ల ప్రక్రియ చేబట్టినట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృ ష్ట్యా స్వల్ప కాలిక ఇబ్బందులు తప్పవన్నారు. నల్లధనం, అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించి, పార్లమెంట్‌ను స్తంభింపచేయడం సరికాదన్నారు. ఈ ప్రక్రియపై పార్లమెంట్‌లో చర్చిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను కొందరు మాత్రమే చెల్లించడం వల్ల పేదలపై పన్నుల భారం పడుతుందని, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారందరూ పన్నులు చెల్లిస్తే పేదలపై పన్నుల భారం తగ్గుతుందన్నారు. డిజిటల్ విధానం వల్ల ప్రభుత్వానికి అన్ని లెక్కలు చెప్పాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. నగదు రహిత విధానం వల్ల భారతదేశానికి మేలు జరుగుతుందన్నారు. అవినీతిని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రధాని మోదీ పెద్ద ఎత్తున సంస్కరణలు తెస్తుంటే ప్రతిపక్షాలు సమర్ధించకపోగా వ్యతిరేకించడం భావ్యం కాదన్నారు. కరెన్సీ ముద్రణ అంటే రాత్రికి రాత్రి జరిగే ప్రక్రియ కాదంటూ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సొమ్ము అంతావైట్ మనీ కాదని, రూ. 2.50 లక్షల పైబడిన సొమ్మును ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరముందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాల్ని ఎప్పటికప్పుడు ప్రధాని మోదీకి వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిజిటల్ విధానం నూరు శాతం అమలవుతుందని భావించడం లేదంటూ పెట్రోలు బంకుల్లో 60 శాతం మంది ఈ ప్రక్రియను అమలు పరుస్తున్నారన్నారు. కరెన్సీ ప్రింటింగ్ పరిస్థితులు మెరుగుపడితే బ్యాంకుల్లో నగదు చెల్లింపులపై విధించిన పరిమితులను ప్రభుత్వం తొలగిస్తుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. డిజిటల్ విధానంపై కొంత మంది స్వార్ధపరులు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు హితవు పలికారు. మోదీ ఏమి చేసినా ప్రతిపక్షాలు గుడ్డిగా విమర్మించడం తగదని వెంకయ్య అన్నారు.

సభ్యత్వ నమోదులో మైలవరం
అగ్రస్థానంలో ఉండాలి
* సమన్వయ కమిటీ సమావేశంలో
తమ్ముళ్ళకు మంత్రి ఉమ ఆదేశం
మైలవరం, డిసెంబర్ 18: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో మైలవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండాలని తెలుగు తమ్ముళ్ళకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. మైలవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈసమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ ఇప్పటి వరకూ 51030 సభ్యత్వాలు పూర్తయ్యాయని ఇంకా వీటిని పెంచాలన్నారు. జనవరి రెండు నుండి ప్రారంభమయ్యే జన్మభూమి కార్యక్రమంలో పించన్లను పంపిణీ చేస్తూ జనచైతన్య యాత్రలో మిగిలి పోయిన గ్రామాలను పర్యటిస్తానని మంత్రి పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి విస్తరణలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు కోల్పోయిన వారికి జన్మభూమి పథకంలో వాటిని ఇచ్చే విధంగా మంత్రి ఉమ చొరవ చూపాలని ఇబ్రహీంపట్నం జడ్పీటిసి కోరగా మంత్రి స్పందిస్తూ తప్పని సరిగా లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు ఇచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఎన్టీర్ గృహ కల్ప పథకం కింద గ్రామాలలో మంజూరైన ఇళ్ళకు సంబంధించి సంబంధిత లబ్ధిదారులతో ఇళ్ళ నిర్మాణాలను వెంటనే ప్రారంభించే విధంగా సభ్యులు చొరవ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గొల్లపూడి, కవులూరు, ఇబ్రహీంపట్నం గ్రామాలలో షాదీఖానా నిర్మాణాలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవినేని ఉమ ప్రకటించారు. చంద్రన్న బీమాపై ప్రజలలో మంచి స్పందన లభిస్తోందని సభ్యులు మంత్రికి తెలిపారు. గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలనకు అందరూ సహకరించాలని, ఇప్పటి వరకూ ఇదే వృత్తిలో బతుకుతున్న పేదలకు రుణాల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు సభ్యులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. జనవరిలో సాగరు జలాలు రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సభ్యులు మంత్రికి సూచించగా ఆయన సరేనన్నారు. సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.