కృష్ణ

బీసీల అభివృద్ధిని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 20: బిసిల అభివృద్ధికి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బిసి సంక్షేమ సంఘం బందరు పార్లమెంట్ అధ్యక్షుడు పామర్తి జయప్రకాష్ నారాయణ విమర్శించారు. బిసిల పట్ల ప్రభుత్వాలు కనబరుస్తున్న సవతి తల్లి ప్రేమను నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 50 శాతం పైబడి ఉన్న బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం బిసిల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని వాపోయారు. బిసిలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, జాతీయ బిసి కమిషనర్‌కు రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి ఏర్పాటు చేయాలని, మండల కమిషన్ సిఫార్సులన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘ నేతలు శేకుబోయిన సుబ్రహ్మణ్యం, అందే జగదీష్, వైఎస్‌ఆర్ ఆంజనేయులు, కెవివి సత్యనారాయణ, లుక్కా పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్పన పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏమిటి?
పామర్రు, డిసెంబర్ 20: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని పామర్రు నియోజకవర్గ టిడిపి నాయకులు ప్రశ్నించారు. వైసిపి కేంద్ర కమిటీ సభ్యురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే విషయంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలు, స్థానిక సంస్థల ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, తెలుగు తమ్ముళ్ళు అభ్యంతరాలు తెలుపుతూ మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పొట్లూరి కృష్ణబాబు, పామర్రు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, పెదపారుపూడి, మొవ్వ మండలాల ఆ పార్టీ అధ్యక్షులు కుదరవల్లి ప్రవీణ్, బీమవరపు అంజిరెడ్డి, చంద్రహాస్, గొట్టిపాటి వెంకట్రావ్ తదితరులతో పాటు సుమారు 100 మంది పార్టీ నేతలు పాల్గొని పార్టీలోకి ప్రముఖులను ఆహ్వానిస్తున్నప్పుడు హైకమాండ్ వారు గ్రామ స్థాయి నేతలతో కొంతమేర అయినా సంప్రదిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కొత్తగా చేరే నేతలకు తాము అడ్డుచెప్పమని, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడే ఉంటామని, కానీ కింది స్థాయి కేడర్‌కు అన్యాయం జరగకుండా చూడాలని తీర్మానించారు. కొత్తగా చేరే నేతలు ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలని విస్మరించకుండా కార్యకలాపాలు సాగించేలా మార్గదర్శకాలను హైకమాండ్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తాము జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలను కలిసి విన్నవించనున్నట్లు వారు తెలిపారు.