కృష్ణ

గన్నవరంలో సిఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్‌పోర్డు నుండి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తరలివెళ్లారు. ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతితో భేటి అయి పోలవరం ప్రాజెక్టుకు సంబంధిచిన నాబార్డు నిధుల చెక్కును స్వీకరిస్తారు. అక్కడ నుండి తిరుగు ప్రయాణంలో తిరుపతిలో జరిగే గౌతమిపుత్ర శతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. వీరికి గన్నవరం ఎయిర్‌పోర్టులో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, బిజేపి జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, నాదెండ్ల మోహన్, శ్రీనివాసరాజు, పీయూష్ దేశాయ్ తదితరులు వీడ్కోలు పలికారు.
హత్యకు కారకులైనవారే
రంగాకు నివాళులర్పించడం హర్షణీయం: కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 26: ఏ పార్టీ వల్ల రంగా హత్యకు గురయ్యారో ఆ పార్టీ నాయకులే రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం హర్షించదగ్గ విషయమని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. సోమవారం స్థానిక ఏజికె మున్సిపల్ ఉన్నత పాఠశాల సెంటర్లో రంగా 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి మాట్లాడుతూ ఎన్టీఆర్, వంగవీటిలను మేమే చంపామని, క్షమించమని అడిగితే శత్రువులను క్షమించే గుణం వారిదని అన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ తనకు సోదర సమానులన్నారు. కాపు యువత పలు సేవాకార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైసీపి నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, కౌన్సిలర్లు గొర్ల శ్రీను, చోరగుడి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శిష్ట్లా దత్తాత్రేయులు, పట్టణ అధ్యక్షుడు వీరిశెట్టి వెంకట నరసింహారావులు రంగా విగ్రహానికి నివాళులర్పించారు.