కృష్ణ

గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల పెంపు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 30: గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను ప్రతిపాదనను విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి పన్ను ప్రతిపాదనను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం తూర్పు కృష్ణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ఇంటి పన్ను పెంపు ఆలోచన దుర్మార్గమన్నారు. పన్ను పెంపు పట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గాల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రజలకు పన్ను పెంపు మరింత భారం కానుందన్నారు. దశాబ్దాల తరబడి నివేశన స్థలాలు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నా దాన్ని పట్టించుకోని ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపేందుకు సిద్ధమవడం గర్హనీయమన్నారు. పట్టాలు ఇవ్వని ఇళ్లకు కూడా పన్నులు విధించే సంస్కృతిని విడనాడాలన్నారు. కరెంట్ బిల్లుల బకాయిలు, చెల్లింపుల వ్యవహారం కొలిక్కి రావడం లేదన్నారు. పెన్ను పెంపుప్రతిపాదనను ఉప సంహరించుకునే వరకు సిపిఎం పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొడాలి శర్మ, శీలం నారాయణరావు, కె వెంకటేశ్వరరావు, మాదాల వెంకటేశ్వరరావు, సాల్మన్ రాజు, పలు గ్రామాల సర్పంచ్‌లు వెంకటేశ్వరరావు, అంజనాదేవి, రత్నమాల, గన్నవరం ఎంపిటిసి పి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
* మా ఎమ్మెల్యేలను లాక్కున్నంత మాత్రాన అధికారంలోకి రావడం కల
* పామర్రుకు సమర్థవంతమైన వ్యక్తిని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తాం
* నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి
పామర్రు, డిసెంబర్ 30: అమలు కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు మరలా అధికారంలోకి రావాలని బలమైన ప్రతిపక్షాన్ని బలహీన పర్చాలని తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోబపెట్టి పన్నుతున్న కుతంత్రం ప్రజల పక్షంలో ఇక నెరవేరదని, చంద్రబాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరటంతో ఆ పార్టీకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నియామకంపై నేతలతో శుక్రవారం స్థానిక సీతారెడ్డి కల్యాణ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు, కార్యకర్తల అభిప్రాయాలను అధినేత జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళతానన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు పామర్రు నియోజకవర్గంలో వైసిపిని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయ సాధనకు దోహదపడే వ్యక్తినే పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తామన్నారు. కార్యకర్తలే గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. చంద్రబాబు పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలు, నేతలు ప్రజలలోకి తీసుకువెళ్లాలన్నారు. ఎమ్మెల్యే కల్పన పార్టీని వీడినంత మాత్రాన అధైర్యపడాల్సిన పనిలేదని, ఆమె వెంట నేతలు, కార్యకర్తలు నేతలు వెళ్లకపోవటం అభినందనీయమన్నారు. భవిష్యత్ అధికారం మనదేనని ఆయన ప్రకటించగా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిరువూరు, గుడివాడ ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కైకలూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి దూలం నాగేశ్వరరావు, వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగు నాగార్జున, తోట్లవల్లూరు జెడ్పీటిసి తాతినేని పద్మావతి, మొవ్వ జెడ్పీటిసి చిమటా విజయశాంతి, నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.