కృష్ణ

జన్మభూమి గ్రామసభలకు సిద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, డిసెంబర్ 30: జన్మభూమి గ్రామసభల సందర్భంగా ప్రజలు ఫిర్యాదులకు గురైన అధికారిపై తీవ్ర చర్యలు తప్పవని బందరు ఆర్డీఓ పి సాయిబాబా అధికారులను హెచ్చరించారు. కష్టపడి ప్రజల మెప్పు పొందాలని విఆర్‌ఓలు, వివిధ శాఖల అధికారులకు సూచించారు. గత జన్మభూమి గ్రామసభలు సందర్భంగా అందిన అర్జీలు, మీ-సేవా కేంద్రాలు ద్వారా, మీకోసం కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి గ్రామసభల నాటికి సంబంధిత అర్జీదారులకు పూర్తి సమాచారం అందచేయాలన్నారు. జన్మభూమి గ్రామసభలపై శుక్రవారం మొవ్వ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ కారణాల సాకుతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని అధికారులను పదవి నుండి తప్పించి యువతకు అవకాశం కల్పిస్తామని హెచ్చరించారు. జిల్లాలో నగదు రహిత చలామణిని పెంపొందించేందుకు వర్తక, వాణిజ్య వర్గాలకు డిపాజిట్ లేకుండా కరెంట్ అకౌంట్ ప్రారంభించాలన్న ప్రభుత్వ సూచనలను పలు బ్యాంకులు అమలుపర్చటం లేదన్న సమాచారంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దనోట్ల చలామణిపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు చిల్లులు పెట్టాయన్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదన్న ప్రచారం జరుగుతోందన్నారు. మొవ్వ గ్రామంలో సర్వే నెం.64,99/1,680, 251,679,311/12 భూములలో 236 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు కృషి చేయాలని గ్రామ సర్పంచ్ తాతినేని పిచ్చేశ్వరరావు ఇచ్చిన అర్జీపై సానుకూలంగా స్పందించారు. జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు 231 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఒక్క రూపాయి తగ్గించి కొనుగోలు చేశారని ఏ రైతు అయినా ఫిర్యాదు చేస్తే సంబంధిత మిల్లర్, దళారీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బి బిక్షారావు, ఎంపిడిఓ వై పిచ్చిరెడ్డి, ఆర్‌ఐ ఎ శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించండి: రాజేంద్ర
ఉయ్యూరు, డిసెంబర్ 30: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణలో భూములు ఇళ్ళు కోల్పోతున్న నిర్వాసితులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించాలని శాసనమండలి సమీక్షా కమిటీ చైర్మన్ వై.వి.బి రాజేంద్రప్రసాద్ కోరారు. మండలంలోని గండిగుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో నూజివీడు రెవెన్యూ డివిజినల్ అధికారి చక్రపాణి నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం నిర్వాసితులకు గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ప్రభుత్వ అందిస్తున్న నష్టపరిహారం సరిగా లేదని, వాటితో వేరే ప్రాంతంలో స్థలాలు, ఇళ్ళు కొనలేని స్థితిలో ఉన్నామని బాధితులు వాపోయారు. దీనిపై స్పందించిన రాజేంద్ర నష్టపరిహారం అరకొరగా ఉండి, వేరే ప్రాంతంలో మార్కెట్ ధరకు స్థలాలు కొని, ఇళ్ళు నిర్మించుకోవడం కష్టమని, కనుక మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇప్పిస్తే సంతృప్తి కరంగా ఉంటుందన్నారు. నిర్వాసితుల్లో ఎక్కువ మంది దళిత, పేద వర్గాలకు చెందినవారైనందున మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆర్‌డిఓ చక్రపాణి మార్కెట్ ధర రు.3,500 ఉండగా విజయవాడ సమీపంలో అందించిన పరిహారం రు.14,000లు అందేలా ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ రోహిణీదేవితో పాటు పలువురు రెవెన్యూ, జాతీయరహదారి అధికారులు పాల్గొన్నారు. నిర్వాసితులకు తెలుగదేశం పార్టీ నాయకులు కొండా ప్రవీణు నాయకత్వం వహించారు.