కృష్ణ

క్రీడల్లో రాణించి దేశప్రతిష్ఠను పెంచేది యువతే: కేసీపీ సివోవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు,డిసెంబర్ 30: మన దేశంలో క్రీడాల్లో రాణించి దేశ ప్రతిష్టను పెంపొందించే యువత ఎక్కవ శాతం ఉన్నారని, ఇలాంటి ఆటల పోటీలు పెట్టటం వల్ల నేపుణ్యం గల క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఉయ్యూరు కేసీపీ సివోవో జి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ గత మూడు రోజులుగా జరుగుతున్న ఉయ్యూరు సబ్‌జోన్ 80వ గ్రిగ్ మెమోరియల్ బాలుర ఆటల పోటీలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. 9 రకాల ఆటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతు ప్రపంచాన్ని శాసించే వనరులు యువత మన దేశంలో పుష్కలంగా ఉన్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి, తహశీల్దార్ జి భద్రు, గ్రామ సర్పంచ్ చిరుమామిళ్ళ ఉమాదేవి తదితరులు ప్రసంగించారు. ఎంఈవో కృష్ణదీలిప్, హెచ్‌ఎం ధనలక్ష్మి, పిడి విజయలక్ష్మి, పీఈటీ మణి, పాములలంక, ఐలూరు, భద్రిరాజుపాలెం సర్పంచ్‌లు పాముల శ్రీనివాసరావు, పిడుగు రాఘవులు, వల్లూరు విమలమ్మ, ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్, లయన్స్‌క్లబ్ నాయకులు నూకల వెంకట సాంబశివరావు, వీరంకి వెంకట గురుమూర్తి, చక్కా ఉదయభాస్కర్, చాగర్లమూడి గోపాలరావు, ఎస్‌ఐ ప్రసాద్, కెసిపి జిఎం వివి పున్నారావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి తైక్వాండో విజేతకు అభినందనలు
అవనిగడ్డ, డిసెంబర్ 30: ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో స్థానిక ఎస్‌విఎల్ క్రాంతి కళాశాల విద్యార్థిని తాడేపల్లి ప్రియాంక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆమె చూపి న అత్యుత్తమ ప్రతిభకు బంగారు పతకం కూడా అందుకోవటం జరిగిందని, జనవరి 1 నుండి 5 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ప్రియాంకను కళాశాల కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, పీడి గాజుల శ్రీనివాసరావు, మత్తి శ్రీనివాసరావు అభినందించారు.