కృష్ణ

గ్రామాల్లో కొత్త పెన్షన్, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికలో అధికారులు తలమునకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 30: ‘కుటుంబ వికాసం - సమాజ వికాసం’ నినాదంతో మరోసారి జన్మభూమి గ్రామసభలకు ప్రభుత్వం నడుం బిగించింది. జనవరి 2వతేదీ నుండి 11వతేదీ వరకు జన్మభూమి - మా ఊరు గ్రామసభలను నిర్వహించనున్నారు. గ్రామసభల్లో కొత్తగా మంజూరైన పెన్షన్‌లు, రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా నిర్వహించిన ‘జన్మభూమి’ సత్ఫలితాలను ఇచ్చింది. నాల్గవ విడత జరిగే జన్మభూమి గ్రామసభల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు సంకేతాలు పంపారు. ప్రతి గ్రామసభకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సవివరంగా వివరించి ప్రజల మెప్పు పొందేందుకు ప్రజాప్రతినిధులు సైతం సిద్ధమయ్యారు. అన్ని శాఖల అధికారులు సైతం జన్మభూమికి హాజరై ప్రజలు లేవనెత్తే సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు కూడా జనవరి 2వతేదీ నుండి జన్మభూమి పేరుతో గ్రామాలకు రానున్నారు. గత జన్మభూమిలో పెన్షన్‌లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లల్లో అర్హులను గుర్తించిన అధికారులు ఈ విడత జన్మభూమిలో వాటిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 2వేలు చొప్పున కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. జిల్లాలో 3.30లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్ల కోసం 70వేల మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో 40వేల మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 3.50కోట్ల మందికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయాలని తీర్మానించారు. నియోజకవర్గానికి 2వేలు చొప్పున అంటే జిల్లాలో 16 నియోజకవర్గాలకు గాను 32వేల పెన్షన్లను పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 40వేల మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు వారి జాబితాలను జన్మభూమి గ్రామసభల్లో ప్రదర్శించనున్నారు. గ్రామసభల అనంతరం జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అలాగే అర్హులైన వారికి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.