కృష్ణ

జిల్లాలో న్యూ ఇ ఇయర్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 1: హ్యాపీ.. హ్యాపీ.. న్యూయియర్.. నూతన సంవత్సర ప్రారంభ వేళ జిల్లాలో కోలాహల వాతావరణం నెలకొంది. అన్ని వర్గాల ప్రజలు 2016కు వీడ్కోలు పలికి 2017 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సులవారు న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంతో పాటు గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ తదితర ముఖ్య పట్టణాల్లో యువత సందడి చేసింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు బంధుమిత్రులతో కలిసి న్యూయర్ కేక్‌లను కట్‌చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. యువత కేరింతలు, బైక్ ర్యాలీలతో ప్రధాన రహదార్లలో పండుగ వాతావరణం కనిపించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వినోద కార్యక్రమాల్లో చిందులు వేశారు. పలు పట్టణాల్లో రెస్టారెంట్లు, హోటళ్లులో విపరీతమైన రద్దీ కనిపించింది. కొంత మంది యువత ఫంక్షన్ హాల్స్‌ను అద్దెకు తీసుకుని మరి బంధుమిత్రులతో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం విశేషం. వర్తక, వాణిజ్య వ్యాపారులకు న్యూ ఇయర్ కాసుల పంట కురిపించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపారాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో ఉన్న వ్యాపారులు న్యూ ఇయర్ పుణ్యమా అంటూ పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగించారు. ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటించటంతో ప్రజలు ఏ మాత్రం నోట్ల రద్దును లెక్క చేయక షాపింగ్ చేశారు.
నాగాయలంకలో..
నాగాయలంక: వివిధ గ్రామాలలో ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు. పలు చోట్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్ చేశారు. బంధుమిత్రులు, ఉద్యోగులు, అధికారులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యంగా యువత పుష్పగుచ్ఛాలు, స్వీట్స్‌తో తమ ఆత్మీయులతో పాలుపంచుకున్నారు. శనివారం స్థానిక బ్యాంకులలో నగదు చెల్లింపుల మొత్తాన్ని పెంచటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.