కృష్ణ

తీర గ్రామాల ప్రజలకు ఆర్టీసీ నూతన కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 1: కృష్ణానదీ తీర గ్రామాల ప్రజలకు ఆర్టీసీ సంస్థ నూతన కానుకను అందించింది. కరకట్ట వెంట గ్రామాల ప్రజలు తక్కువ దూరంతో తక్కువ చార్జీతో సులభతరంగా ప్రయాణం చేసేందుకు అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి విజయవాడకు ఆదివారం బస్సు సర్వీస్సులను ప్రారంభించింది. అవనిగడ్డ డిపో నుంచి వచ్చై బస్సుల సమయాల బోర్డుని తోట్లవల్లూరు కరకట్టపై అధికారులు ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు ఆరుట్రిప్పులు, మళ్ళీ చల్లపల్లి మీదుగా అవనిగడ్డకు ఆరు ట్రిప్పులు బస్సులు తిరుగుతాయి. తోట్లవల్లూరు పాయింట్ నుంచి విజయవాడకు ఉదయం 7.45,8.45, మధ్యాహ్నం 12.15,1.15, సాయంత్రం 4.45,5.45 గంటలకు బస్సులు వెళతాయి. అలాగే విజయవాడ నుంచి తిరిగి వచ్చే టప్పుడు చల్లపల్లి మీదుగా అవనిగడ్డకు తోట్లవల్లూరు పాయింట్ వద్ద ఉదయం 9.15,10.15, మధ్యా హ్నం 1.45,2.45, రాత్రి 6.15,7.15 గంటలకు బస్సులు ఉంటాయని అవనిగడ్డ డిపో మేనేజర్ టైమింగ్ బోర్డులను పెట్టారు. కరకట్ట వెంట బస్సు సర్వీసులు ప్రారంభమవటం కొత్త సంవత్సరంలో నూతనాధ్యాయంగా తీర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ట్రైలర్ మాత్రమేనని సక్సెస్ అయితే మరిన్ని బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపి ఉన్నారు. తోట్లవల్లూరు నుంచి చినఓగిరాల, కంకిపాడు మీదుగా విజయవాడకు వెళ్ళేందుకు 1.30 గంటల సమయం పడుతుంది. అదే కరట్టపైగా వెళితే కేవలం అర్థగంటలో విజయవాడకు చేరుకుంటారు. గంట సమయం కలిసి వస్తుంది. ఉద్యోగస్థులు, వ్యాపారులు, వర్కర్‌లకు కరకట్ట వెంట బస్సు సర్వీసు ఒక వరంగా ఉంటుంది.

బీసీ వసతి గృహాల్లో కార్పొరేట్ స్థాయి విద్యాప్రమాణాలు

మచిలీపట్నం, జనవరి 1: వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టళ్ల ద్వారా పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక వలందపాలెం బిసి సంక్షేమ వసతి గృహంలో ఆదివారం సాయంత్రం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి రవీంద్రతో పాటు ఎంపి కొనకళ్ల నారాయణరావు కలిసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రానున్న పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. వసతి గృహ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం చెప్పినట్టు ప్రతి విద్యార్థి కలలు కనటంతో పాటు ఆ కలలను సాకారం చేసుకోవాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా పయనించాలన్నారు. బిసి సంక్షేమ శాఖ డిడి ఆర్ యుగంధర్ మాట్లాడుతూ ఈ ఏడాది బిసి సంక్షేమ శాఖ ద్వారా 50 ట్రిబుల్ ఐటి సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ప్రకాశం జిల్లా బిసి సంక్షేమాధికారిణి లక్ష్మీ దుర్గ తదితరులు పాల్గొన్నారు.