కృష్ణ

ఇంకా ఎన్నాళ్లీ కరెన్సీ వెతలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 2: నోట్ల రద్దు ప్రకటన వెలువడి దాదాపు 50రోజులు గడిచినా ఇంత వరకూ నోట్ల రద్దు వల్ల ఏర్పడిన వెతలు తీరనే లేదు. పర్యవసానంగా జనం బ్యాంకుల ముందు పడిగాపులు పడుతూనే ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళీ కరెన్సీ వెతలంటూ జనం ఈసడించుకుంటున్నారు. చాలినంత సొమ్ము బ్యాంకులలో అందించని కారణంగా ప్రతిరోజూ బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో నిల్చుండాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి అనేక మార్లు తమ సొమ్ము తీసుకునేందుకు తాము అనేక పాట్లు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. ఈసమస్య ఎప్పటికి తీరెనో అని నిరుత్సాహానికి గురవుతున్నారు. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకూ కరెన్సీ కోసం తాము బాధలు పడుతూనే ఉన్నామని ఇంత వరకూ సమస్య కొలిక్కి రాలేదని, అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రెండు, మూడు వేలకు మించి బ్యాంకులు సొమ్ము ఇవ్వటం లేదని ప్రతిరోజూ తమ సొమ్ము తీసుకునేందుకు తాము పనులు మానుకుని బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఈకారణంగా తము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. కూలీలకు సొమ్ములివ్వాలన్నా చాలినంత కరెన్సీ లేక ఇక్కట్లు పడుతున్నామని చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలు జరపాలని ప్రభుత్వం చెబుతున్నా అన్ని సందర్భాలలో ఇది సాధ్యం కావటం లేదని పేర్కొంటున్నారు. నెలలు గడిచినా ఈసమస్యకు పరిష్కారం లభించే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా బ్యాంకులకు కావాల్సినంత నగదును అందించి సామాన్యుడి వెతలు తీర్చాలని వారు పేర్కొంటున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి మంచి వేదిక జన్మభూమి గ్రామసభ
* సబ్ కలెక్టర్

తోట్లవల్లూరు, జనవరి 2: ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి - మా ఊరు గ్రామసభలు మంచి వేదికలని విజయవాడ సబ్ కలెక్టర్ సలోని సిదాన అన్నారు. మండలంలోని యాకమూరులో సోమవారం జరిగిన 4వ విడత జన్మభూమి- మా ఊరు గ్రామ సభకు సబ్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ ప్రజల వద్దకు అధికారులు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జన్మభూమి ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య జన్మభూమి గ్రామ సభలు వారిధి వంటివన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సలోని సిదాన చేతుల మీదుగా కొత్తగా మంజూరైన 50 రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేశారు. పింఛన్ లబ్ధిదారుల జాబితా లేకపోవటంపై ఎంపిపి ఆగ్రహం: యాకమూరులో ఎంతమందికి కొత్తగా పింఛన్‌లు మంజూరయ్యాయో వివరించాలని, మండలానికి ఎన్ని పింఛన్లు వచ్చాయో నివేదిక కావాలని ఎంపిపి కళ్లం వెంకటేశ్వరరెడ్డి ఎంపిడివో ఎస్ పద్మసుధను అడిగారు. వివరాలు లేవని, యాకమూరులో 28మంది పింఛన్‌కు అర్హులు ఉన్నారని, వారిలో 20మందికి పింఛన్ వచ్చే అవకాశం ఉందని పద్మసుధ తెలిపారు. వచ్చే అవకాశం ఉండటం కాదని, పింఛన్‌ల కోసం వచ్చిన వారికి ఏమి సమాధానం చెబుతారని ఎంపిపి ప్రశ్నించారు. అయితే కంప్యూటర్‌లో సైట్ ఓపెన్ కాలేదని పద్మసుధ సమాధానమిచ్చారు. సైట్ ఓపెన్ కాకపోతే గ్రామాలలో కొత్త పింఛన్‌లు ఎలా పంపిణీ చేస్తారని వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఎనిమిది ఇసుక క్వారీలు ఉన్నా అవనిగడ్డ వరకు వెళ్ళి ఇసుక తీసుకురావటం ప్రజలకు భారంగా మారిందని, అందువల్ల మండలంలో గృహనిర్మాణాలకు ఎడ్లబండ్లతో ఇసుక తోలుకోవటానికి అనుమతి ఇవ్వాలని ఎంపిపి సబ్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పీహెచ్‌సీ డాక్టర్ గోపాలనాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రొయ్యూరు ఆయుర్వేద డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి, తహశీల్దార్ జి భద్రు, ఎంపిటిసి సభ్యుడు బొమ్మారెడ్డి కోటిరెడ్డి, కార్యదర్శి జి సూరిబాబు విఆర్‌ఓ గోపాలకృష్ణ పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.