కృష్ణ

కుమ్మరిగూడెంలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 2: జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు కుమ్మరిగూడెంలో వివాదాస్పద ఇండోర్ స్టేడియం భూముల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. గతంలో కుమ్మరిగూడెంవాసులకు ఇచ్చిన 22 ఎకరాల భూమిలో ప్రభుత్వం స్టేడియం నిర్మాణానికి సిద్ధమైంది. గత రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు మట్టి తోలేందుకు ప్రయత్నం చేయగా దీన్ని స్థానికులు తీవ్రంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య బాధితుల పక్షాన నిలబడ్డారు. కుమ్మరిగూడెం వాసులకు సంఘీభావం తెలిపి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా అడ్డుకున్నారు. ఆందోళనకారులు, మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న డియస్‌పి శ్రావణ్‌కుమార్ ఘటనా స్థలికి వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ పేర్ని నాని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన పేర్ని నానితో పాటు వైసిపి కౌన్సిలర్లు అచ్చాబా, అస్ఘర్, లంకా సూరిబాబు, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, సిహెచ్ జయరావు, సాల్మన్‌రాజు తదితరులను పోలీసులు అరెస్టు చేసి గూడూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను పేర్ని నాని తీవ్రంగా వ్యతిరేకించారు. కుమ్మర వృత్తి కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కుని ప్రభుత్వం స్టేడియం నిర్మాణానికి పూనుకోవడం గర్హనీయమన్నారు. స్థల వివాదంపై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినా అధికారులు లెక్క చేయకుండా దౌర్జన్యంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చర్యలను వైఎస్‌ఆర్ సిపి తీవ్రంగా ప్రతిఘటిస్తుందన్నారు. రానున్న రోజుల్లో బాధితులకు అండగా నిలిచి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

పెట్రో ధరల పెంపు నవ కానుకనా?
* పిసిసి నేత తులసిరెడ్డి ఎద్దేవా
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 2: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మోదీ సర్కార్ పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి దేశ ప్రజలకు భారాల బహుమతి అందజేశారని ఎపిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. ప్రజా రంజక పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ నెల రోజుల వ్యవధిలో 3 సార్లు ధరలు పెంచి ప్రజలపై తనకున్న మక్కువను చాటుకున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేసారు. గత నవంబర్‌లో ప్రకటించిన నోట్ల రద్దుతోనే నానా పాట్లు పడుతున్న దేశ ప్రజలకు మరింత భారమైయ్యే విధంగా పెట్రో ధరలతోపాటు వంట గ్యాస్ ధరలను సైతం పెంచారన్నారు. గత కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయంగా చమురు ధరలు ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ నాడు పెట్రోల్ 56, డీజిల్ 41 రూపాయలకు అందించగా నేడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గి ప్రపంచమంతా పెట్రో ధరలు తగ్గినా భారత దేశంలో మాత్రం పెట్రోల్ 75, డీజిల్ 63 రూపాయల వరకూ పైపైకి పెరుగుతున్న వైనం శోచనీయమన్నారు. మోదీ పాలనలో ఇప్పటి వరకూ 8 సార్లు ఎక్సైజ్ సుంకం పెంచితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంవ్యాట్ పెంచిన వైనం వారి అసమర్థపాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు.