కృష్ణ

నోట్ల రద్దుపై మంత్రి కామినేనిని నిలదీసిన మూలలంకవాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, జనవరి 3: నోట్ల రద్దుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్‌ను ప్రశ్నించినందుకు నలుగురిని కలిదిండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మూలలంక గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో గ్రామానికి చెందిన మహదేవ విజయబాబు నోట్ల రద్దు వల్ల ప్రజలంతా ఇబ్బందులకు గురవుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ మంత్రి కామినేనిని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కామినేని విచక్షణారహితంగా ప్రశ్నించే వ్యక్తులను అరెస్టు చేయాలంటూ అక్కడ ఉన్న పోలీసులను ఆదేశించారు. రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న తరుణంలో ఇదేమి న్యాయం అంటూ కర్రే సూర్యనారాయణ, మహదేవ సాయి, రాంబాబు ముందుకు వచ్చారు. దీంతో వారిని కూడా లోపల పడేయండన్న కామినేని ఆదేశాన్ని అక్కడున్న పోలీసులు స్వీకరించి మంత్రిని ప్రశ్నించిన వ్యక్తులను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మంత్రి చర్యలకు అక్కడున్న గ్రామస్థులంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత గ్రామసభ సజావుగా సాగింది.

పోర్టు నిర్మాణంలో న్యాయవాదులు భాగస్వాములు కావాలి
* మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (లీగల్), జనవరి 3: బందరు అభివృద్ధిలో న్యాయవాదులు భాగస్వాములు కావాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. బందరు పోర్టు ఆవశ్యకతను వివరిస్తూ మంగళవారం స్థానిక బార్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన సదస్సుకు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోస్తా జాతీయ రహదారి, బందరు పోర్టు, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చూపిన స్ఫూర్తితో పోర్టు నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని న్యాయవాదులను కోరారు. బందరుకు గత వైభవాన్ని తీసుకు వచ్చేందుకు స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయన్నారు. రాజధానికి దగ్గరలో ఉన్న బందరుకు పోర్టు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం భూసమీకరణకు సిద్ధమైందని, దీనికి న్యాయవాదులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. భూముల ధరలు గణనీయంగా పెరగటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. పోర్టుతో పాటు మెగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. చిలకలపూడి రైల్వే గేటు కుడివైపు పోర్టు, ఎడమ వైపు మెగా టౌన్‌షిప్ నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయవాదుల సంక్షేమ సంఘానికి ప్రస్తుతం రూ.3లక్షలు ప్రభుత్వం ఇస్తోందని, దీన్ని మరింత పెంచటంతో పాటు న్యాయవాదులందరికీ నివేశన స్థలాలు మంజూరు చేయాలని, బదిలీల్లో న్యాయవాదుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు మంత్రి రవీంద్ర, ఎంపి నారాయణరావులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కూనపరెడ్డి శ్రీనివాస్, తుంగల హరిబాబు, మహావా కార్యదర్శి సింగలూరి శాంతి ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మధుసూదనరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.