కృష్ణ

ప్రేక్షకులను తన్మయపర్చిన మైత్రేయి నృత్య ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జనవరి 6: హైదరాబాద్‌కు చెందిన వైద్యుల మైత్రేయి ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు ప్రేక్షకులను తన్మయపర్చాయి. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళావేదికపై ఏర్పాటు చేసిన యక్షగాన పితామహుడు చింతా వెంకట్రామయ్య స్మృచ్యోత్సవం సందర్భంగా నాట్యాచార్య చింతా ఆది నారాయణ శిష్యురాలు వైద్యుల మైత్రేయి ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు నయనానందకరంగా సాగాయి. టెక్నికల్ అండ్ కాలేజ్ యేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ డిఎస్ కొండాదాస్, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు, దూరదర్శన్ విజయవాడ సంచాలకులు ఎం విజయ భగవాన్, ఆకాశవాణి సహాయ సంచాలకులు జి శైలజారావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కూచిపూడి నాట్యాంశాలు ఆహుతులను అలరించాయి. గణపతి స్తోత్రంగా సాంప్రదాయ కూచిపూడి నృత్యంలో నటేశ కౌత్వం అంశాన్ని, త్రినేత్రం త్రిఆయుధం అనే శివ స్తుతిని, అన్నమాచార్య విరచిత ముద్దుగారే యశోద.. అనే అంశాన్ని, ఉషాపరిణయం ప్రవేశ దరువు, రారా ఎదువంశ సుదాంబుది చంద్ర అనే నారాయణ తీర్దుల కృష్ణ శబ్ధం అంశం, ఆలోకయే బాలకృష్ణం అనే తరంగం, శ్రీ సిద్దేంద్ర విరచిత భామాకలాపం ప్రవేశ దరువుగా భామనే సత్యభామనే అనే అంశం, ధర్మపురి సుబ్బరాయ అయ్యర్ విరచిత పరులున్నమాట అనే జావళి, బాలాంతరపు రజినికాంతారావు రచించిన మహేశ్వరి.. మహాకాళి అనే లిలతా రహస్యనామస్తోత్రంను ప్రదర్శించి ప్రేక్షకులను తన్మయపర్చింది. చింతా ఆదినారాయణ శర్మ నృత్యదర్శకత్వంలో ఈ అంశాలను తొలిసారిగా రంగప్రవేశం చేసి ప్రదర్శించినా నాట్యాచార్యులు ప్రశంసలందుకుంది. ఈ సందర్భంగా నాట్యాచార్య పసుమర్తి రత్తయ్య శర్మ, నాట్యాచారిణి లంకా అన్నపూర్ణాదేవి, భాగవతుల వెంకటరామశర్మ, పసుమర్తి శ్రీనివాస్, తెలుగు విశ్వవిద్యాలయం ప్రాజెక్టు అసిస్టెంట్ డా. ఎల్ లింగయ్యలను అతిథులు ద్వారా కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కళాకారిణి మైత్రేయి, గురువు ఆదినారాయణ శర్మలను సత్కరించారు.

నాగాయలంకలో సంక్రాంతికి ప్రత్యేక కార్యక్రమాలు

నాగాయలంక, జనవరి 6: స్థానిక కృష్ణాతీరాన గల శ్రీరామపాదక్షేత్రం వద్ద సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈనెల 13న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛ నాగాయలంక సొసైటీ అధ్యక్షుడు మండవ బాబూరావు, స్వచ్ఛ నాగాయలంక కన్వీనర్ డా. ఎవిఎల్ నారాయణ తెలిపారు. శుక్రవారం స్వచ్ఛ నాగాయలంక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ కార్యక్రమాలను చేపట్టటం జరిగిందని తెలిపారు. ఉదయం భోగి మంటలతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, గరగరనృత్యం, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా పడవ పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు
* ఎపి కౌలురైతు సంఘం అధ్యక్షుడు రంగారావు

మచిలీపట్నం, జనవరి 6: రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజీ లేని పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకాలంలో పంట రుణాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. సకాలంలో సాగునీటిని విడుదల చేయడంలో కూడా విఫలమవుతున్నారని ఆరోపించారు. ఫలితంగా సాగులో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయన్నారు. రైతు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. నోట్ల రద్దుతో రైతులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా రైతులకు పరిమితులు లేకుండా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ పిఎసిఎస్‌ల ద్వారా నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వకపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. కార్పొరేట్ బ్యాంక్‌ల మీద ఉన్న ప్రేమ ప్రభుత్వ సంస్థ అయిన కెడిసిసి మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. తొలుత రైతువాణి పేరుతో ముద్రించిన క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, టివి లక్ష్మణస్వామి, పంచకర్ల రంగారావు, చేబ్రోలు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.