కృష్ణ

పింఛన్ల ఎంపికపై గ్రామసభలో రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 7: తోట్లవల్లూరు శనివారం జరిగిన జన్మభూమి గ్రామసభలో కొత్త పింఛన్ లబ్ధిదారుల ఎంపిక తెలుగుదేశం, వైసిపి నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. గ్రామసభ చివరలో వైస్ ఎంపిపి పిఎస్ కోటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి రాణిని పింఛన్‌ల ఎంపికపై వివరణ అడగటంతో వివాదం ప్రారంభమయింది. తమకు తెలియకుండానే 60 మంది లబ్ధిదారుల ఎంపిక ఎలా చేశారని ప్రశ్నించారు. దీంతో జన్మభూమి కమిటీ సభ్యులు పద్మజ, సీతారాంబాబు, టిడిపి నాయకుడు చింతపల్లి వెంకటేశ్వరరావు కల్పించుకున్నారు. వాదన పెరగటంతో టిడిపి నాయకులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు వేదిక వద్దకు రావటంతో గందరగోళం నెలకొంది.

దుర్గంధం వెదజల్లుతున్న చేపల చెరువు
అవనిగడ్డ, జనవరి 7: మండల పరిధిలోని మోదుమూడి గ్రామంలోని మంచినీటి చెరువులోని చేపలు మృతి చెందటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కారణంగా దుర్వాసన వెదజల్లుతోందని, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చూడాలని అధికారులను కోరారు.

బంగారం, టీవీల దొంగ అరెస్ట్: సొత్తు స్వాధీనం

మైలవరం, జనవరి 7: పలు ఇళ్లలో బంగారం, టివిలను దొంగిలించటంతోపాటు బైక్‌లను దొంగిలించిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్న సంఘటన ఇది. మైలవరం సీఐ వెంకట రమణ కధనం ప్రకారం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామానికి చెందిన బత్తుల కిరణ్ అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం సమయంలో ద్విచక్ర వాహనంపై విజయవాడ వైపు నుండి మైలవరం వైపునకు వస్తుండగా సమాచారం తెలుసుకున్న సీఐ వెంకట రమణ ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్ళి స్థానిక ఎల్బీఆర్సీఇ వద్ద దారికాచి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో విచారించగా అతని వద్ద సుమారు రెండు లక్షల రూపాయల విలువ గలిగిన బంగారు ఆభరణాలు, రెండు టివిలు, అతను నడుపుతున్న బైక్, అంతకుముందు మరో ప్రాంతంలో దొంగిలించిన బైక్‌ల విషయాన్ని ఒప్పుకున్నాడు. నిందితుని వద్ద నుండి వీటిని స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి శనివారం ఉదయం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి నిందితునికి రిమాండ్ విధించినట్లు తెలిపారు.