కృష్ణ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 7: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రతి యేడాది జన్మభూమి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మండల పరిధిలోని వాడపాలెం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఆయన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవటంతో పాటు వాటి పరిష్కారానికి జన్మభూమి గ్రామసభలు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా గొప్ప వరమన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, అంగవైకల్యం సంభవిస్తే రూ.3.5లక్షలు, సహజ మరణానికి రూ.30వేలు ఈ పథకం కింద బీమా సౌకర్యం కల్పించామన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని దినాలు కల్పించటంతో పాటు గ్రామాల్లో రహదారులు, చెరువులు, కాలువల మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, మండల టిడిపి అధ్యక్షుడు తలారి సోమశేఖర్, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.
17న జెడ్పీ స్థారుూ సంఘ సమావేశాలు

మచిలీపట్నం, జనవరి 7: ఈ నెల 17వతేదీన జిల్లా పరిషత్ స్థారుూ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జెడ్పీ సిఇఓ టి దామోదర నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30ని.లకు ప్రారంభమయ్యే 1, 2, 3, 4, 5, 6, 7 స్థారుూ సంఘ సమావేశాలు ఆయా సంఘాల అధ్యక్షుల అధ్యక్షతన జరుగుతాయని తెలిపారు. సంఘ సభ్యులు, అధికారులు విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.

ఈ - పోస్
రద్దు చేయకుంటే
మూకుమ్మడి రాజీనామాలు
* రేషన్ డీలర్లు

రద్దు చేయమంటే
మిమ్మల్నే తొలగిస్తాం
* మంత్రి ఉమ
మైలవరం, జనవరి 7: జన్మభూమి సాక్షిగా రేషన్ డీలర్లపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. శనివారం మండలంలోని పుల్లూరు జన్మభూమి సభలో పలువురు రేషన్ డీ లర్లు తమ సమస్యలపై మంత్రికి విన్నవించేందుకు వెళ్ళగా వారికి మంత్రి నుండి చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుత పరిస్థితులలో తమికిస్తున్న కమీషన్ సరిపోవటం లేదని, ఈపోస్ విధానం వల్ల తాము, లబ్ధిదారులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విధానాన్ని మార్చకపోతే మూకుమ్మడిగా తాము రాజీనామాలు చేస్తామని రేషన్ డీలర్లు మంత్రి ఎదుట వాపోయారు. ఇందుకు స్పందించిన మంత్రి ఉమ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రాజీనామాలు చేయటం కాదు మిమ్మల్ని మేమే తొలగిస్తాం, అనేక ఇబ్బందులు పడుతూ, ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినా పేదల కోసం తాము రేషన్ సరఫరా చేస్తుంటే వాటిని పంపిణీ చేయటానికి ఏంటి ఇబ్బందులంటూ వారిపై మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇప్పటి వరకూ తిన్న రేషన్ డీలర్లు ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతికతను అంగీకరించలేకపోతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటే సహించేది లేదన్నారు.