కృష్ణ

పన్నులు వసూలు లక్ష్యం చేరకపోతే... జీతం నిలిపేస్తారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 15: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విఎంసి కమిషనర్ వీరపాండియన్ అనుసరిస్తున్న అనుచిత వైఖరి చర్చనీయాంశమైంది. పన్ను వసూలులో టార్గెట్ సాధించని రెవెన్యూ సిబ్బందికి చెందిన ఏప్రిల్ నెల జీతాలను నిలిపివేసిన వైనంపై ఇటు విఎంసి ఉద్యోగులలోనే కాక ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. విధుల్లో అలక్ష్యం, నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం సహజమే అయినప్పటికీ పన్ను వసూలులో విధించిన టార్గెట్ సాధించకపోతే తీసుకునే క్రమశిక్షణ చర్యలు ఏమిటి, ఈచర్యల్లో జీతాల నిలిపివేత ఉందా లేదా అన్న విషయంపై కూడా పరిశీలన చేస్తున్న ఉద్యోగులు కమిషనర్ చర్యలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో సరైన ఫలితాలు సాధించని ఉపాధ్యాయులపై కూడా ఈ విధంగానే అనుసరించిన కమిషనర్ ఆయా టీచర్లకు చార్జ్ మెమోలైతే జారీ చేశారు కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. కాగా ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగుల విషయంలోకి వచ్చే సరికి ఏకంగా జీతాలనే నిలిపేసిన వైనం గమనార్హం. 15వ తేదీ వచ్చినా జీతాలను విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే ఈ జీతాలను మళ్లీ ఇస్తారా లేక నిలిపేస్తారన్న విషయంతోపాటు మరో పదిహేను రోజుల్లో ప్రస్తుత నెల ముగుస్తున్నందున వచ్చే మే నెల పరిస్థితి ఏమిటన్న విషయంపై ఉద్యోగులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు సైలెంట్‌గా ఉంటే వచ్చే నెల జీతాలను కూడా నిలిపేసే అవకాశం లేకపోలేదు కాబట్టి ఇప్పుడే తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో విఎంసి ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి ప్రస్తుత సంవత్సరంలో పన్ను వసూలు నూటికి నూరు శాతమే కాకుండా నూట ఐదు శాతం వసూలు చేసిన తీరుపై ఈనెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా కమిషనర్‌కు మేయర్ కోనేరు శ్రీ్ధర్ బల్లలు చరిచించి మరీ అభినందనలు తెలిపిన వైనం గమనార్హం కాగా ఇక ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలేమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సెక్షన్‌లోని 48 మంది బిల్ కలెక్టర్లు, 15 మంది ఆర్‌ఐ లతోపాటు అసిస్టెంట్ కమిషనర్ల జీతాలను కూడా నిలిపేసినట్టు అధికారిక సమాచారం. జీతాల నిలిపివేత చర్యలు నైతికమా, అనైతికమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఉద్యోగుల క్రమ శిక్షణ చర్యల నియమ నిబంధనల్లో జీతాల నిలిపివేత ఎటువంటి సందర్బాల్లో అమలుచేస్తారు, ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులకు ఈ చర్యలు వర్తిస్తాయాలేదాన్న విషయాలపై ఉద్యోగులు చర్చలు జరుపుతున్నారు. ఏదైనా, ఎప్పుడైనా తప్పుడు చర్యలతో సస్పెండైన ఉద్యోగికి కూడా సగం జీతం ఇచ్చి కుటుంబ పోషణ చేసుకునే అవకాశం ఉంటుండగా ప్రస్తుత రెవెన్యూ ఉద్యోగులకు ఏకంగా జీతం మొత్తం నిలిపేసిన వైనం ఎంతవరకు సబబు అన్న విమర్శలు వెల్లువెత్తుతుండగా నిలిపిన జీతాలను మరలా ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయం ఎవ్వరికీ అంతుపట్టని వైనంగా ఉంది. ఈవిషయంపై కమిషనర్ వీరపాండియన్‌ను సంప్రదించి తగు పరిష్కార మార్గం చూపేవిధంగా నేడో రేపో ఉద్యోగుల సంఘం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఉద్యోగుల సంఘం చర్చలు విఫలమైతే తదుపరి కార్యాచరణ పై వారు చేస్తున్న సమాలోచనల్లో భాగంగా ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వానికి కమిషనర్‌పై ఫిర్యాదు చేయడమా లేక ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడదామన్న అంశంతోపాటు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న ఆలోచనలు చేస్తున్నారన్న విషయం తెలుస్తోంది.