కృష్ణ

అన్యాయం జరిగితే తిరగబడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 9: అభివృద్ధి పేరుతో ఏ ఒక్క కుమ్మరికి అన్యాయం జరిగినా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న కుమ్మర్లందరినీ ఏకం చేసి పాలకులపై తిరగబడతామని తెలంగాణకు చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి హెచ్చరించారు. స్థానిక కుమ్మరిగూడెంలో కుమ్మరుల జీవన వృత్తి కోసం 1971 సంవత్సరంలో నాటి ప్రభుత్వం కేటాయించిన 22 ఎకరాల భూమిలో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం స్టేడియం నిర్మాణానికి పూనుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొలుసు పార్థసారథి, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), సిపిఎం నాయకులు కొడాలి శర్మ తదితరులు మద్దతుగా నిలిచారు. తొలుత మూడు స్తంభాల సెంటరు నుండి కలెక్టరేట్ వరకు వందలాది మంది బాధిత కుమ్మరులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో తెలంగాణకు చెందిన టిఆర్‌ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి మాట్లాడుతూ బిసిల పార్టీని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఆ వర్గాలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. బిసిల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. బిసిల్లో అనేక కులవృత్తులు ఉన్నాయని, కుల వృత్తుల కోసం కేటాయించిన భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం కుమ్మరిగూడెంలో 40యేళ్ల క్రితం కుమ్మరులకు కేటాయించిన 22 ఎకరాల్లో స్టేడియం నిర్మాణానికి పూనుకోవడం గర్హనీయమన్నారు. ఎపి కుమ్మరి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి లలిత్ ప్రజాపతి మాట్లాడుతూ కుమ్మరిగూడెం వివాదంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. కుమ్మరులను అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా పాలకులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు కెపి సారథి మాట్లాడుతూ కుల వృత్తులను నిర్వీర్యం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసిపి అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ పోర్టు పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం నేడు స్టేడియం పేరుతో కుమ్మరిగూడెం వాసులకు నిలువ నీడ లేకుండా చేస్తోందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ఎఓ మూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపి కుమ్మరి యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్, కోశాధికారి సంగమేశ్వర్, ఉపాధ్యక్షుడు గుంటూరు ఈశ్వరయ్య, బొమ్మిన కోటేశ్వరరావు, వైసిపి నాయకులు బొర్రా విఠల్, లంకే వెంకటేశ్వరరావు, అచ్చాబా, మారుమూడి విక్టర్ ప్రసాద్, కెవిపిఎస్ నాయకుడు సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నోట్ల రద్దుతో ఆర్థిక సంక్షోభంలోకి దేశం
* డిసిసి అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహనరావు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 9: ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచిత నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహనరావు ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎఐసిసి పిలుపు మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పరాసుపేట సెంటరులో ఖాళీ పళ్లాలు, గరిటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ధనేకుల మురళీ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలైనట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు నోట్ల రద్దుతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు గుమ్మడి విద్యాసాగర్, అబ్దుల్ మతీన్, ధనలక్ష్మి, ఎన్ కుమారి, బలగం విజయశేఖర్, బుల్లెట్ ధర్మారావు, రామిశెట్టి ప్రసాద్, యండి ఇషాక్, కోటేశ్వరరావు, వాటపల్లి సాయి పద్మజ, భోగిరెడ్డి వెంకటేశ్వర్లు, పెదశింగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపిడివో పద్మసుధను విచారించిన అధికారులు
* జెడ్పీ సీఈవో ఆదేశాలతో విచారణ
తోట్లవల్లూరు, జనవరి 9: తోట్లవల్లూరు ఎంపిడివో ఎస్‌ఈ పద్మసుధను సోమవారం పశువర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి మధుసూదనరావు ఆధ్వర్యంలో విచారించారు. 2వ విడత, 3వ విడత జన్మభూమి గ్రామసభల నిర్వహణ నిధులు రూ.2.12లక్షలు, సంక్రాంతి సంబరాల నిర్వహణ నిధులు రూ.2లక్షలను ఖర్చు చేయటంలో ఎంపిడివో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. పంచాయతీలకు డబ్బులు చెల్లించకుండా ఖర్చులు చూపటం, సంక్రాంతి సంబరాల నిధులను నకిలీ బిల్లులతో దుర్వినియోగం చేసినట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతమయింది. దినపత్రికల్లో వచ్చిన కధనలకు అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి ఎంపిడిఓను విచారించేందుకు వచ్చిన పశువర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి మధుసూదనరావు విచారణధికారిగా, జడ్పీ సెక్షన్ సూపరింటెండెంట్ వి రాంబాబు, గెజిటెడ్ ఆఫీసర్స్ మేనేజర్ శర్మ మధ్యాహ్నం 1.30 వరకు ఎదురుచూసి అనంతరం ఫోన్ ద్వారా ఆమెను ఆఫీసుకు పిలిపించి విచారించారు. నిధులు ఖర్చు చేసిన విధానం, బిల్లుల చెల్లింపులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారించి ఎంపిడివో నుండి లిఖిత పూర్వక సమాచారం తీసుకున్నారు. విచారణ అంశాలను సీఈవోకి నివేదిస్తామని మధుసూదనరావు తెలిపారు.
జన్మభూమి ద్వారా సమస్యల పరిష్కారం
బంటుమిల్లి, జనవరి 9: జన్మభూమి గ్రామసభల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అర్తమూరు, చోరంపూడి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. అర్తమూరులో జరిగిన గ్రామసభకు హాజరైన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రలు పడని కారణంగా రెండు నెలలుగా పెన్షన్‌లు తీసుకోవడం లేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పెన్షన్‌లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంపిపి వలవల వనవలమ్మ, జెడ్పీటిసి దాసరి కరుణాజ్యోతి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ బొల్లా వెంకన్న, ఎంపిడివో చింతా కళావతి, తహశీల్దార్ దాసరి విజయ శేఖరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధిష్ఠానం ఆదేశిస్తే పామర్రు నుంచి పోటీ: డివై దాస్

కూచిపూడి, జనవరి 9: పామర్రు నియోజకవర్గ వైసిపి కార్యకర్తల కోరిక మేరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే డివై దాస్ పేర్కొన్నారు. వైసిపి రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి దోనేపల్లి రత్నశేఖర్ అధ్యక్షతన సోమవారం స్థానిక సీతామహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో దాస్ మాట్లాడుతూ ఇప్పటికే వైసిపి రాష్ట్ర నాయకత్వం పామర్రు నియోజకవర్గ పగ్గాలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. 2009-14 సంవత్సరాలలో నియోజకవర్గ శాసనసభ్యుడిగా తాను చేసిన అభివృద్ధిని అధిష్ఠానం పరిగణలోకి తీసుకున్నదన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కార్యకర్తలు సహకారం, అంకితభావం అందించి తనకు విజయం చేకూర్చాలని దాస్ కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్‌సి సెల్ కార్యదర్శి తునిమిల్లి సుందరప్రసాద్, జిల్లా నాయకులు మండా రమేష్, గంటా దేవదానం, మోరపాక మహేష్, కంచర్ల చిన్న, పెయ్యల రాజు, బండ్రపల్లి జాకబ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌విఎల్ క్రాంతి విద్యార్థినుల హ్యాట్రిక్
అవనిగడ్డ, జనవరి 9: స్థానిక ఎస్‌విఎల్ క్రాంతి కళాశాలకు చెందిన విద్యార్థినులు ఆటల పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను వరుసగా మూడుసార్లు సాధించి హ్యాట్రిక్ సృష్టించారు. ఇటీవల ఉయ్యూరు జూనియర్ కళాశాలలో జిల్లా జూనియర్ కళాశాలల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్‌విఎల్ క్రాంతి విద్యార్థినులు ఐదు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. వాలీబాల్, త్రోబాల్‌లో ప్రథమ స్థానం, చదరంగం, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీలలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను పొందారు. విద్యార్థినులను కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ గాజుల శ్రీనివాసరావు అభినందించారు.
రాష్టస్థ్రాయి కబడ్డీ జట్టుకు మొవ్వ విద్యార్థులు
కూచిపూడి, జనవరి 9: రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలకు మొవ్వ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్‌ఎం దుర్గాప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ నెల 11 నుండి 14 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాఠశాలకు చెందిన బండ్రపల్లి అఖిల, వేములపల్లి లేఖనలు పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన విద్యార్థులను హెచ్‌ఎంతో పాటు పిడి పూర్ణచంద్రరావు, పిఇటి వెంకటేశ్వరరావు అభినందించారు.
కన్నుల పండువగా వేంకటేశ్వరుని గ్రామోత్సవం

గుడ్లవల్లేరు, జనవరి 9: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలో వేంచేసియున్న శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గ్రామోత్సవాన్ని ఆదివారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన స్వామివారి గ్రామోత్సవం వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వీరారెడ్డి, కనుమూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.