కృష్ణ

పండుగ నిధులను మింగేస్తున్నారు : ఎమ్మెల్యే రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, జనవరి 12: మండలంలోని నక్కలంపేట గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దివంగత నేత మాగంటి కోటేశ్వరరావు జ్ఞాపకార్థం ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ మాగంటి అబ్బాయి ఆధ్వర్యంలో గురువారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. 80మంది మహిళలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీనటి, వైకాపా ఎమ్మెల్యే రోజా చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రోజా మాట్లాడుతూ తెలుగు వారు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. పాలకులు పండుగల నిర్వహణ నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాలన తీరును తీవ్రంగా విమర్శించారు. వైఎస్ హయాంలోనే ప్రాజెక్టులకు సంబంధించి 90శాతం పనులు పూర్తి అయితే పది శాతం పనులు పూర్తి చేసి తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొలుత రోజాకు పరిటాల ఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి కార్యకర్తలు, నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైకాపా నాయకులు మంగునూరు కొండారెడ్డి, కాలవ వాసుదేవరావు, బండి మల్లికార్జునరావు, రాయల నర్శింహరావు తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంకు నూతన శోభను తీసుకొస్తున్నాం
* మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, జనవరి 12: జిల్లా కేంద్రం మచిలీపట్నంకు నూతన శోభను తీసుకు వస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన కోనేరుసెంటర్ సర్కిల్, వాటర్ ఫౌంటేషన్‌ను గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పట్టణానికి ముఖ ద్వారమైన కోనేరు స్థూపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలోని ప్రధాన రహదార్లను డబుల్ లైన్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సెంటర్ డివైడింగ్‌తో పాటు వీధి దీపాల వ్యవస్థను మెరుగుపర్చామన్నారు. రానున్న రోజుల్లో మచిలీపట్నంలో మరిన్ని ఆకర్షణీయమైన అభివృద్ధి పనులు నిర్వహించి పూర్వ వైభవం సంతరింప చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, కమిషనర్ జస్వంతరావు, కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావ్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, నారగాని ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.