కృష్ణ

కోడి కూత.. కోత ముక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 13: కోడి కూత.. కోత ముక్క.. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత కోడి పందాలకు కృష్ణాజిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అధికార తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతి యేటా జిల్లాలో ఆధునిక హంగులతో నిర్వహిస్తున్న కోడి పందాలకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసిన బరులన్నీ కళకళలాడుతున్నాయి. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బరుల వద్ద కోట్లలో పందాలు జరుగుతున్నాయి. ఒక పక్క కోడి పందాలు మరో పక్క కోత ముక్కతో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. లక్షలాది రూపాయలతో బెల్టు షాపులను దక్కించుకున్న మద్యం వ్యాపారులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. బరుల వద్దకు వచ్చే పందెపు రాయుళ్ల కోసం నిర్వాహకులు సకల సౌకర్యాలు కల్పించటంతో ఉదయం నుండి రాత్రి వరకు బరుల వద్దే ఉంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో ఏర్పాటు చేసిన బరి జిల్లాలోనే అతి పెద్ద బరి కావటంతో జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పందెపు రాయుళ్లు ఈ బరికి వచ్చి లక్షల్లో పందాలు వేస్తున్నారు. రాత్రి పూట కోడి పందాలు లేకపోయినా కోత ముక్కను కొనసాగిస్తున్నారు. 24గంటల పాటు కోత ముక్క నిర్వహిస్తున్నారు. కోత ముక్క ద్వారానే నిర్వాహకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. పండుగ ముందు రోజైన గురువారమే జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించగా పండుగ తొలి రోజైన శుక్రవారం వాటి సంఖ్య మరింత పెరిగింది. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం పల్లిపాలెం, మునిపెడ, బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట, అర్తమూరు, పెదతుమ్మిడి, ఘంటసాల మండలం కొడాలి, మోపిదేవి మండలం వెంకటాపురం, బందరు మండలం మేకావానిపాలెం, కైకలూరు మండలం భుజబలపట్నం, కలిదిండి మండలం పోతుమర్రు తదితర గ్రామాల్లో బరులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కోడి పందాలు, పేకాట, గుండాట, చిన్నబజారు, పెద్ద బజారు తదితర జూదాలు నిర్వహించారు.

రైతుల కష్టాలను మరిపించే పండుగ సంక్రాంతి
తోట్లవల్లూరు, జనవరి 13: రైతులు ఏడాది పొడవునా పడిన కష్టాలను మర్చిపోయేలాచేసి భోగ భాగ్యాలను తీసుకు వచ్చే ఏకైక పండుగ సంక్రాంతి ఒక్కటేనని ఎమ్మెల్సీ యమలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. కుమ్మమూరులో జిల్లా తెలుగుయువత మాజీ అధ్యక్షుడు రామినేని కుటుంబయ్య శుక్రవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేశారు. హరిదాసుల కీర్తినలు, గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. అలాగే బరిలో కోడిపుంజులను కలిపి పందేలను ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతు పండించిన పంటలు రైతుల ఇళ్లకు వచ్చే సమయంలో సంక్రాంతి పండుగ రావటం అందరికి సంతోషాలనిస్తుందన్నారు. కత్తులు కట్టకుండా సంప్రదాయమద్దంగా కోడిపందేలను వేసుకోవాలని రాజేంద్రప్రసాద్ కోరారు. కార్యక్రమంలో జిల్లా టిడిపి బీసీసెల్ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, పిఎసిఎస్ అధ్యక్షుడు రామినేని రాజా, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఎస్‌వి కృష్ణరావు, ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్, మండల జన్మభూమి కమిటీ సభ్యుడు వీరపనేని శివరాం తదితరులు పాల్గొన్నారు.