కృష్ణ

సంస్కృతీ సంప్రదాయాలకే రంగవల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 15: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరాలకు తెలియజెప్పేందుకే రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేతేపల్లి సూరిబాబు అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతియేటా మాదిరిగానే ఈయేడాది కూడా మండల ఆర్యవైశ్య సంఘం, వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కోదండరామాలయం వీధిలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈపోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల రంగవల్లులను సుందరంగా ఆకర్షణీయంగా అలంకరించారు. పోటీల అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎంపిక చేసి విజేతలకు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల ద్వారానే ప్రతిభను గుర్తించవచ్చన్నారు. ప్రతియేటా సంక్రాంతికి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహకంగా పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీలతోపాటు తాడు లాగుడు, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలను నిర్వహించి మహిళలో ఆనందాన్ని నింపటమే ధ్యేయమన్నారు. ఈపోటీలలో పాల్గొన్న అందరికీ బహుమతులు ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నేతలు కాజా మహేష్, జూలకంటి ప్రసాద్, రాధాకృష్ణ, వాసవీ మహిళా మండలి నేతలు అనుమోలు రాణి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతితో కళకళలాడిన పల్లెలు
తోట్లవల్లూరు, జనవరి 15: సంక్రాంతి పండుగతో పల్లెలు కళకళలాడాయి. పట్టణాల్లో ఉన్న పల్లెవాసులు పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు చేరుకోవడంతో ఆదివారం పల్లెల్లో పండుగ సందడి మార్మోగింది. గురువారం రాత్రి నుంచే పట్టణాల నుంచి బంధువులు, మిత్రులు, కుటుంబ సమేతంగా పల్లెకు చేరుకుని సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కొత్త అల్లుళ్లతో పల్లె గృహాలు కళకళలాడాయి. పట్టణాల నుంచి వచ్చిన బంధువులు కోడిపందాల్లో సరదాగా సందడి చేస్తు గడిపారు. వీధి వీధినా పండుగ కళ ఉట్టి పడింది. శీతాకాలపు చలి, తొలిమంచు తెరల చాటున యువకులు ఊరూర భోగి మంటలు వేశారు. హరినామ సంకీర్తనలతో వీధుల్లో ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లుతున్న హరిదాసులు, పంచరంగుల వస్తధ్రారణతో ఆకట్టుకుంటున్న డూడూ బసవన్నలు, వైష్ణవతత్వాన్ని రంగరించి గ్రామ సౌభాగాన్ని కాంక్షిస్తూ గంగిరెద్దుల ఆటలు, పాటలు, ఆశీర్వచనాలు, మహిళలు ఇళ్ల ముంగిట రంగులతో తీర్చిదిద్దిన రంగవల్లులు, వాటిపై సంప్రదాయ రీతిలో అమర్చిన గొబ్బెమ్మలు, పిండి వంటల ఘుమఘుమలతో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారు.