కృష్ణ

పెద్దా.. చిన్నా... అందరి చేతిలో పందెం కోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జనవరి 15: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దివిసీమ ప్రాంతానికి చెందిన పందెపు రాయుళ్లతో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పందెపు రాయుళ్లు వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న కోడి పందాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దా.. చిన్నా ... అందరి చేతిలో పందెం కోళ్లు కనిపిస్తుండగా కోలాహల వాతావరణం కనబడింది.

ఘనంగా శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవం
బంటుమిల్లి, జనవరి 15: మండల పరిధిలోని ఆముదాలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పూజా కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో రథోత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నందిగామ దుర్గా ప్రసాద్ సారథ్యంలో నందిగామ శివ శంకర వర ప్రసాద్ దంపతులు, తుర్లపాటి ఫణి పర్యవేక్షణలో ఆలయ పూజారి రుద్రపాక గోపాలం రథోత్సవాన్ని నిర్వహించారు.
ఘనంగా సంక్రాంతి సంబరాలు
కూచిపూడి, జనవరి 15: మొవ్వ మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బంధుమిత్రులతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. పలు గ్రామాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆదివారం కనుమ పండుగ కావటంతో రైతులు తమ పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో ముత్తేవి సీతారాం గురుదేవులు గోపూజ నిర్వహించారు. కూచిపూడిలోని జంధ్యాల పాండురంగ శర్మ కుటుంబ సభ్యులు గో పూజ చేసి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.