కృష్ణ

పంతం నెగ్గింది.. పందెం నడిచింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 15: సుప్రీం కోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసి మండలంలో యథేచ్ఛగా కోడి పందాలు నిర్వహించారు. మూగ జీవాల రక్తంతో మరోమారు నేల తడిసింది. చట్టాలు మూగబోయాయి... సంప్రదాయానికే మా మద్దతన్న నేతల మాటలే నెగ్గాయి. కోడిపందేలను ఆరు నూరైనా అడ్డుకుంటామన్న పోలీసులు కీలక ఘట్టానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. వెరసి... మండల వ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా సాగిపోయాయి. పందాల రూపంలో రూ.కోట్లు చేతులు మారగా... కత్తులు దూసుకున్న కోళ్లు కదనరంగంలో రక్తమోడే వరకు పోరాడి నేలకూలాయి. తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెం గ్రామంలో కృష్ణనది ఒడ్డున భారీ బరి ఏర్పాటు చేయటంతో సంక్రాంతి పండుగ మూడురోజులు కోడిపందేలు, పేకాట, గుండాటతో బరులు కళకళలాడాయి. బరీలో ఆటల కోసం ప్రత్యేక షామియానాలు, రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్‌లు ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున జిల్లా నలుమూల నుంచి జనం తరలిరావటంతో మందు దగ్గర నుంచి విందు వరకు సకల సౌకర్యాలు కల్పించారు. ఇంత జోరుగా ఆటలు సాగుతున్న పోలీస్ యంత్రాంగం అటువైపు కనె్నత్తి చూడకపోవటం గమనార్హం. ఆదివారం కనుమ పండుగ ముగింపు రోజు కావటంతో బరులకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. ఈ బరులు సోమవారం కూడా కొనసాగించాలని నేతలు చూస్తున్నారు. ఇప్పటికే గెలిచివాడు ఆనందంతో, ఓడిపోయిన వాడు ఊసురమని ఏడుస్తున్నారు. మండలంలోని కుమ్మమూరు, గరికపర్రు, దేవరపల్లి తదితర గ్రామాల్లో చిన్నపాటి బరులు సిద్ధం చేశారు. ఈ ప్రాంతాల్లో మూడు రోజులుగా సుమారు 5కోట్లు వరకూ నగదు చేతులు మారినట్లు సమాచారం. తొలిరోజున హైకోర్టు తీర్పు నేపథ్యంలో మండలంలో కోడిపందేలు నిర్వహించాలా? వద్దా సందిగ్ధంలో పందెం రాయుళ్లు కొట్టుమిట్టాడారు. బరులు, ఏర్పాట్లు చేసినా అనుమతి వచ్చాక ఆడతామని చెప్పారు. అయితే నాయకుల అభయంతో మధాహ్నం సమయం నుంచి ఒక్కొక్కరుగా పందాలు నిర్వహణ ప్రారంభించారు. దీంతో చిన్నచిన్న బరులవారు కూడా ధైర్యంగా పోటీలు ఆరంభించారు. మండలంలో పలు గ్రామాల్లో విచ్చల విడిగా కోడిపందేలు జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం గస్తీ నిర్వహించకుండా మిన్నకుండిపోయారు. మండలంలోని వల్లూరుపాలెంలో గ్రామంలో భారీ ఎత్తున పకడ్బందీగా చేసిన ఏర్పాట్ల మధ్య కోడి పందేలు జోరుగా సాగాయి. బారులు తీరిన కార్లు, కోడి పుంజులకు ఎండ తగలకుండా ప్రత్యేక షామియానాలల్లో ఏర్పాట్లు చేసి, వచ్చిన వారికి బిర్యాని, మద్యం లభించటానికి ప్రత్యేక దుకాణాలను ఏర్పాట్లు చేయటంతో పెద్దఎత్తున జనం బరులకు బారులు తీశారు. మూడు రోజులుగా పగలు, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు జోరుగా కోడిపందేలు, పేకాట, గుండాట, కోతముక్క, లోనబయట ఆటలు విచ్చల విడిగా సాగాయి. జిల్లాలో పలు గ్రామాల నుంచి వల్లూరుపాలెంలో భారీ ఏర్పాటు చేశారని, ఆనోటా ఈనోటా విపరితమైన ప్రచారం జరగటంతో శని, ఆదివారాలు జనం పోట్టేతారు. వల్లూరుపాం బరిలో పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. సోమవారం కూడా అధికార పార్టీ నేతలు బరులు నిర్వహించాలని చూస్తున్నారు. కాని పొలీస్ యంత్రాంగం ఏ విధంగా స్పందింస్తోందో వేచి చూడాలి.