కృష్ణ

ఉద్యోగావకాశాలకు ఆంగ్లభాష కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జనవరి 16: ఉద్యోగావకాశాలు పొందడంలో ఆంగ్లభాష కీలకపాత్ర పోషిస్తుందని సిడ్ని (ఆస్ట్రేలియా) సౌత్‌వేల్స్ విశ్వవిద్యాలయం ఆంగ్లభాష అధ్యాపకురాలు, నోబుల్ కళాశాల పూర్వ విద్యార్థిని సుష్మా జయ శేఖర్ అన్నారు. స్థానిక నోబుల్ కళాశాల ఆంగ్ల భాష విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆంగ్లంలో సంభాషణలు-రాత నైపుణ్యాలు అనే అంశంపై ఒక రోజు కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుష్మా మాట్లాడుతూ ఆంగ్లంలో పట్ట్భద్రులైనవారు కూడా ఆంగ్ల భాషలో మాట్లాడడం, రాయడంలో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గది నుండే ఆంగ్లభాషలో మాట్లాడటం సాధన చేయాలన్నారు. ఆంగ్లభాష క్లబ్‌లు ఏర్పాటుచేసి ఆంగ్లంలో మాట్లాడడానికి తగిన అవకాశాలను కల్పించడం ద్వారా భాషణ నైపుణ్యాన్ని పెంపొందించాలన్నారు. ఇద్దరు విద్యార్థులను ఒక జట్టుగా ఏర్పాటుచేసి సంభాషించే విధానాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ బిజె స్టీఫెన్, ఆంగ్ల శాఖాధిపతి డా. ఎస్‌జె ఎర్నేస్ట్, అధ్యాపకులు కెజెఎ శామ్యూల్, ఎస్‌ఆర్‌బి చక్రవర్తి, హెవీల, ప్రిస్కిల్లా, దీనా ఎలెజబెత్, ఆనంద్‌రాజు, తృతీయ సంవత్సరం డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
ముగిసిన షటిల్ టోర్నీ
చందర్లపాడు, జనవరి 16: కాండ్రపాడు యూత్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి మొదలైన మండలస్థాయి షటిల్ టోర్నమెంట్ ఫైనల్స్ సోమవారంతో ముగిశాయి. టోర్నమెంట్ సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి చందర్లపాడుకు- 2016 రూ.లు, ద్వితీయ బహుమతి కాండ్రపాడుకు -1016 గెలుచుకొన్నా రు. అలాగే జూనియర్స్ విబాగంలో ప్రధమ, ద్వితీయ బహుమతు లు కాండ్రపాడు జట్లు గెలుచుకొన్నాయి. గెలచిన జట్లుకు జెడ్‌పిటిసి సభ్యులు వాసిరెడ్డి ప్రసాద్ అబినందించారు.