కృష్ణ

సాగర్ జలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, జనవరి 16: నాగార్జున సాగర్ మైలవరం బ్రాంచి మూడవజోన్‌కు సరఫరా అవుతున్న సాగర్ జలాలను రైతులు ఆరుతడి పంటలకు వినియోగించుకోవాలని రాష్ట్ర జలవనరులశాఖ ఎఫెక్ట్ కమిటీ సభ్యుడు ఆళ్ళ గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని కృష్ణారావుపాలెం సమీపంలోని ఎన్‌ఎస్‌పి 13.9 కిలోమీటరు వద్ద సాగర్ జలాలను పరిశీలించారు. ఆనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాల మేరకు రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషితో ఈప్రాంతానికి రెండవసారి సాగర్‌జలాలను విడుదల జరిగిందన్నారు. రైతులు కాలువలకు ఎక్కడా గండ్లు పెట్టకుండా చివరిప్రాంతాలకు నీరు చేరేలా సహకరించాలని కోరారు. తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల రైతాంగానికి 15రోజుల పాటు నీటి సరఫరా ఉంటుందని, దీనిని రైతులు సద్వినియోపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వై పుల్లయ్యచౌదరి, విస్సన్నపేట డిసి చైర్మన్ నాదేళ్ళ కేశిబాబు, ఎన్‌ఎస్‌పి ఈఈ అర్జునరావు, డెప్యూటి ఈఈ ఆనందబాబు, రైతులు పాల్గొన్నారు.

పండగ ముగిసినా తగ్గని జోరు
* కొనసాగిన కోడి పందాలు, జూదాలు
* పోలీసుల స్పందన షరా మామూలే..
మైలవరం, జనవరి 16: సంక్రాంతి పర్వదినం సందర్భంగా వేసే కోడి పందాలు మూడు రోజుల పండగ ముగిసినా కొనసాగిస్తూనే ఉన్నారు. గత మూడు రోజులుగా నిరంతరాయంగా కొనసాగిన ఈ పందాలు సోమవారం కూడా యథేచ్ఛగానే కొనసాగాయి. పండగ మూడు రోజులపాటు జరిగిన ఈఅసాంఘిక కార్యకలాపాలను చూసీ చూడనట్లుగా వ్యవహరించిన పోలీసుశాఖ సోమవారం జరిగిన కార్యకలాపాలను సైతం పట్టించుకోకపోవటం గమనార్హం. పందేలరాయుళ్ళతో పోలీసులు లాలూచీ పడి తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నారు. కోడి పందాలకు అనుమతిచ్చారా అని పోలీసులను అడిగిన మీడియా మిత్రులకు అబ్బే అటువంటిదేమీ లేదని వారు సమాధానం చెప్పటం గమనార్హం. మరో వైపు కోడి పందాలు, పేకాట శిబిరాల వద్ద జరిగిన ఘర్షణల విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఘర్షణలా తమ దృష్టికి రాలేదే అని తేలిగ్గా కొట్టిపారేశారంటే పరిస్థితిని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పందాలలో, కోసాటలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఈ అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకులు అమాయకుల నుండి భారీగా దండుకుని జేబులు నింపుకుని పోలీసుల జేబులు కూడా నింపినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే నిర్వాహకులు గతంలో ఎన్నడూ లేని విధంగా దర్జాగా తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. కోడి పందాలు, పేకాట కార్యకలాపాలు ఇంకా కొనసాగుతాయంటూ పరిసర ప్రాంతాల వారిని నిర్వాహకులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఎన్నిరోజులకు అనుమతులు తీసుకున్నారో విచారణ జరిపితేగానీ తెలియదంటున్నారు. మరో వైపు కూలి, నాలి చేసుకుని నాలుగు రూపాయలు తెచ్చి ఇంట్లో పండగ చేయకుండా పందేలలో తగలేస్తే కుటుంబం గడిచేదెలా, పిల్లలు పండగ చేసుకునేదెలా అని సామాన్య మహిళలు గగ్గోలు పెడుతున్నా, వీరి గోడు వినేవారెవరూ కనిపించడం లేదు. ఏది ఏమైనా పండగ ముసుగులో పందాల వ్యవహారంపై పలువురు ఆక్షేపిస్తున్నారు.