కృష్ణ

కలవరపెడుతున్న వరిగడ్డి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 17: జిల్లాలో వరిగడ్డి ధరలు పాడి రైతులను కలవరపెడుతున్నాయి. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందని కారణంగా జిల్లాలో ఖరీఫ్ సాగు పూర్తిగా జరగలేదు. ఫలితంగా వరిగడ్డి ధరలు చుక్కలనంటుతున్నాయి. గత ఏడాది నిల్వ చేసుకున్న వరిగడ్డి మచ్చుకైనా లేకపోవటంతో ప్రస్తుతం కుప్పలపై ఉన్న వరిగడ్డి కోసం పశు పోషకులు తహతహలాడుతున్నారు. ధాన్యం ధరలు అనుకూలంగా లేకపోవటంతో పాటు రెండవ పంటగా సాగు చేసిన అపరాల పైర్లు ఏపుగా ఉండటంతో కుప్పలు తీసేందుకు రైతులు ఆసక్తి చూపకపోవటంతో వరిగడ్డికి గిరాకీ బాగా పెరిగింది. కొంత మంది రైతులు మాత్రమే కుప్పలను నూర్పిడి చేస్తుండటంతో వారి వద్ద నుండి వరిగడ్డిని కొనుగోలు చేసేందుకు పశు పోషకులు ఎగబడుతున్నారు. ఎకరా రూ.6వేలు నుండి రూ.7వేలకు పైగా ధరకు కొనుగోలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఎకరా రూ.1600 మాత్రమే ఉండే వరిగడ్డి ధరలు గత సంవత్సరం నుండి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పశుపోషకులు పశువులను మోపేందుకు ఇష్టం చూపించకపోవటంతో జిల్లాలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో ఆ ప్రభావం పాల దిగుబడిపై కూడా పడింది. ఒక పక్క వరిగడ్డి ధరలతో పాటు దాణా ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో కొంత మంది రైతులు తమ పశువులను తెగనమ్ముకుంటున్నారు. అలాగే పాలు ఇచ్చే పశువులను మినహా అన్ని పశువులను అయినకాడికి తెగనమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వీటిలో దూడలు, పడ్డలు కూడా ఉండటం విశేషం.

ఫ్లెక్సీల తొలగింపు
కూచిపూడి, జనవరి 17: జిల్లాలో వైసిపి నాయకుల విగ్రహాలు, ఫ్లెక్సీ బ్యానర్ల ధ్వంసం నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన విగ్రహాలు, ఫ్లెక్సీల రక్షణకు పోలీసు శాఖ నడుం బిగించింది. సోమవారం మండలంలోని విగ్రహాలకు కాపలా పెట్టిన పోలీసులు, మంగళవారం మండలంలో టిడిపికి చెందిన ఫ్లెక్సీల తొలగింపు చర్యలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొవ్వ హెచ్‌సి నాంచారయ్య, కూచిపూడి విఆర్‌ఓ కె వేణుగోపాలరావు గ్రామంలోని ఫ్లెక్సీ బ్యానర్లను పంచాయతీ సిబ్బంది ద్వారా తొలగించి టిడిపి పార్టీ నాయకులకు అప్పగించారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో ఈ తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
అవనిగడ్డ, జనవరి 17: కోడూరు పోలీసు స్టేషన్ పరిధిలోని వి.కొత్తపాలెంకు చెందిన బాదర్ల పద్మజ (33) మంగళవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన అర్జునరావుతో పద్మజ వివాహం 2005లో జరుగ్గా వారికి ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. అర్జునరావు ప్రతి రోజూ అవనిగడ్డ వచ్చి పనులు చేసుకుంటూ ఉంటాడు. కాగా ఇటీవల వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపారు. కాగా మంగళవారం ఉదయం పద్మజ ఉరి వేసుకుని చనిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవనిగడ్డ ఎస్‌ఐ మణి కుమార్ ప్రాథమిక విచారణ జరిపి కోడూరు పోలీసులకు కేసును బదిలీ చేశారు. అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో శవ పరీక్ష చేశారు.

దాళ్వా సాగుకు సన్నాహాలు
తోట్లవల్లూరు, జనవరి 17: మండలంలోని వల్లూలుపాలెంలో దాళ్వా వరిసాగుకి రైతులు పెద్దఎత్తున సన్నద్ధమవుతున్నారు. వందలాది ఎకరాల్లో దాళ్వాసాగు చేపట్టేందుకు రైతులు యంత్రాలతో వరికోతలు కోయించారు. సుమారు 200 ఎకరాల్లో దాళ్వాసాగు చేపట్టే అవకాశం ఉందని రైతులు తెలిపారు. నారుమడులు ఏపుగా పెరుగుతుండగా మరోవైపు బోర్లద్వారా పొలాలను తడుపుతున్నారు. కొద్ది రోజుల్లో దాళ్వానాట్లు ప్రారంభమవనున్నాయి.