కృష్ణ

700 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జనవరి 17: గౌరవరం వద్ద మంగళవారం తెల్లవారుఝామున రెండు లారీల్లో అక్రమంగా తరలివెళుతున్న 700 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ సిఐ అబ్దుల్ నబీ తెలిపిన వివరాల ప్రకారం వత్సవాయి మండలం లింగాల నుండి సాధారణ బియ్యం లాగా దొంగ వే బిల్లులు సృష్టించి వాటిని పోర్టుకు తరలిస్తున్నట్లుగా నమోదు చేసి నల్లబజారుకు తరలిస్తున్నారని అన్నారు. తమ శాఖ జిల్లా అధికారి రవీంద్రనాథ్ బాబుకు అందిన సమాచారం మేరకు ఆయన ఆదేశాల మేరకు నిఘా పెట్టి రెండు బియ్యం లారీలను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఒక లారీని కాకినాడ పోర్టుకు, ఒక లారీ మచిలీపట్నం పోర్టుకు వెళుతున్నట్లుగా వే బిల్లులో నమోదు అయి ఉందని, ఈ దొంగ వే బిల్లుల వ్యవహరం మొత్తం తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం లారీలను చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి చిల్లకల్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. విజిలెన్స్ ఎస్‌ఐ సత్యనారాయణ, స్థానిక ఆర్‌ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రైవేటుదే పైచేయి
* ప్రభుత్వం ధరకంటే రూ.40 ఎక్కువ
*- అలంకార ప్రాయంగా కొనుగోలు కేంద్రాలు

తోట్లవల్లూరు, జనవరి 17: మండలంలో వరి కుప్పనూర్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. అన్ని గ్రామాల్లో రైతులు కుప్పనూర్పిళ్లు చేపట్టారు. రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ద్వారా పది పిఎసిఎస్‌లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే అవి అలంకార ప్రాయంగా మారాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే ప్రైవేటు వ్యాపారులు బస్తా ధాన్యానికి రూ.40 ఎక్కువగా చెల్లిస్తుండటమే కారణం. ప్రభుత్వం ఎ గ్రేడు రకం 75 కేజీల బస్తాకు 1132.50 రూ.లు, బి గ్రేడు రకం బస్తాకు 1102.50 రూ.ల ధరను నిర్ణయించింది. అయితే ప్రైవేటు వ్యాపారులు ఎ గ్రేడు రకం 75 కేజీల ధాన్యాన్ని రూ.1170 లకు కొనుగోలు చేస్తుండటం విశేషం. ప్రభుత్వ ధరకంటే ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ రేటు చెల్లించటం రైతులను సంతోష పరుస్తోంది. ఎప్పుడు ప్రభుత్వ ధరకంటే రకరకాల కారణాలు చూపి రూ.10, 20 తక్కువకు కొనుగోలు చేసే వ్యాపారులు ఈసారి ఎక్కువ చెల్లిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఉండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల అడ్రస్, బ్యాంకు ఖాతా తీసుకుని మిల్లర ద్వారా పిఎసిఎస్‌లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల ఖాతాలోకి డబ్బులు వేయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళితే రకరకాల ఆంక్షలు, నిబంధనలు ఉంటాయని, అవన్నీ తాము భరించలేమని, ప్రైవేటు వ్యాపారులతోనే సుఖంగా ఉంటోందని రైతులు చెపుతున్నారు. రూ.4.90 కోట్ల ధాన్యం సేకరణ
ఇదిలా ఉండగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు రాకున్నప్పటికీ ధాన్యం సేకరణ నమోదవుతుండటం విశేషం. అంటే అది ప్రైవేటు వ్యాపారుల ద్వారా మిల్లర్లు తీసుకువస్తున్న ధాన్యంగా తెలుస్తోంది. మండలంలోని పది పిఎసిఎస్‌లలో ఇప్పటి వరకు 336 మంది రైతుల నుంచి రూ.4.90కోట్ల ధాన్యం కొనుగోలు జరిగిందని మండల ఏఈవో సునీల్ తెలిపారు. ఈ సందర్భంగా పురంశెట్టి జగదీశ్వరరావు అనే రైతు మాట్లాడుతూ మాగాణిలో 3.5 ఎకరాల కౌలు పొలంలో వరిసాగు చేశానని, కుప్పనూర్పిడి చేయగా 1026 రకం ధాన్యం 75 కేజీల బస్తా రూ.1170 చొప్పున వ్యాపారి కొనుగోలు చేశాడని తెలిపారు. అదే ప్రభుత్వ రేటు రూ.1132 ఉందని, కళ్లంలో నుంచి నేరుగా వ్యాపారి కొనుగోలు చేస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్మగలుగుతున్నామని ఆ రైతు తెలిపారు.