కృష్ణ

ఎంఆర్‌పి అమలు చేయకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 19: మద్యం విక్రయాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఎక్సైజ్, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్‌పి ధరలకే మద్యం విక్రయాలు జరగాలన్నారు. అలాగే సమయ పాలన కూడా ఖచ్చితంగా పాటించాలన్నారు. బెల్టు దుకాణాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. ఈ విషయంలో రాజకీయ వత్తిళ్లకు లొంగాల్సిన పని లేదన్నారు. మచిలీపట్నం పురపాలక సంఘ పరిధిలో ఆక్రమణలు తొలగించి రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆక్రమణల తొలగింపులో కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని, ఇటువంటి వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ సమీక్షలో పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మనోహర్, బందరు డియస్‌పి శ్రావణ కుమార్, ట్రాఫిక్ డియస్‌పి హుస్సేన్, ఎక్సైజ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
డిఎస్‌ఓగా నాగేశ్వరరావు బాధ్యతలు

మచిలీపట్నం, జనవరి 19: జిల్లా పౌర సరఫరాల శాఖాధికారిగా జి నాగేశ్వరరావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డియస్‌ఓల బదిలీల్లో భాగంగా చిత్తూరు డియస్‌ఓగా పని చేస్తున్న జి నాగేశ్వరరావు జిల్లాకు బదిలీ కాగా కృష్ణాజిల్లా డియస్‌ఓ రవి కిరణ్ పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావు విలేఖర్లతో మాట్లాడుతూ కలెక్టర్ బాబు.ఎ నేతృత్వంలోని టీమ్-కృష్ణాతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించడం ఆనందంగా ఉందన్నారు. చౌక ధరల దుకాణాలు, ఎరువుల దుకాణాల్లో అమలవుతున్న ఇ-పోస్ విధానాన్ని మరింత పటిష్ఠవంతంగా అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

ముగ్గురు డిసిసి కార్యదర్శుల నియామకం
మైలవరం, జనవరి 19: జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులుగా మైలవరం నియోజకవర్గం నుండి ఏకంగా ముగ్గురిని ఎంపిక చేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహన్ ఇచ్చిన ఉత్తర్వులను శాసన మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య చేతుల మీదుగా గురువారం వారు అందుకున్నారు. నియోజకవర్గంలోని జి కొండూరు మండలం గడ్డమణుగు గ్రామానికి చెందిన అప్పసాని బాబూరావు(చెర్వుమాధవరం సొసైటీ అధ్యక్షుడు), మైలవరానికి చెందిన ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ గణపవరపు విష్ణువర్థనరావు, జి కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన గాలంకి ఇసాక్‌లను జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులుగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సి రామచంద్రయ్య ముగ్గురికి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని హితోపదేశం చేశారు. పిసిసి కార్యదర్శి అప్పసాని సందీప్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ధనేకుల మురళీ మోహన్, మైలవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ బొర్రా కిరణ్, జిల్లా కార్యదర్శి వీరంకి శ్రీ్ధర్, అబ్దుల్ రియాజ్ భాషా తదితరులు పాల్గొన్నారు.
బేస్‌మెంట్ వరకు 18 గృహాలు
అవనిగడ్డ, జనవరి 19: మండల పరిధిలోని తుంగలవారిపాలెం గ్రామానికి చెందిన అర్జా సరస్వతి గృహానికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఏఇ శ్రీనివాస్ తెలిపారు. అదే గ్రామంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత ఉగాది నాడు 70 సెంట్ల భూమిలో 24 మంది లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చి భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. వాటిలో 18 గృహాలు బేస్‌మెంట్ వరకు రాగా ఐదు భూమి పూజతోనే ఆగిపోయాయన్నారు. ఇప్పటికే లబ్ధిదారులకు రూ.10,800 నగదు, 10 సిమెంటు బస్తాల చొప్పున అందించటం జరిగిందని, గృహ నిర్మాణ శాఖ రూ.92వేలు, ఉపాధి హామీ పథకం కింద రూ.58వేలు అందించామన్నారు. ఎన్టీఆర్ గృహ పథకం కింద 89 గృహాలకు 30 మాత్రమే ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు.