కృష్ణ

వైసిపి కౌన్సిలర్లలో బయటపడ్డ లుకలుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, జనవరి 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో లుక లుకలు బయటపడ్డాయి. పురపాలక సంఘంలో ఆ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు గురువారం కాంట్రాక్టు, ప్యానల్ కమిటీల పదవులకు రాజీనామాలు చేశారు. కమిషనర్ మనె్నం గోపాలరావుకు తమ రాజీనామా పత్రాలను అందచేయటంతో ఆ పార్టీలోని భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. కాంట్రాక్టు కమిటీకి మెట్ల గోపిప్రసాద్, గరికముక్కు చంద్రబాబు, ఫ్యానల్ కమిటీకి వీరంకి నరసింహారావు, కటకం ప్రసాద్ చేసిన రాజీనామా పట్టణంలో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ ఒంటెద్దుపోకడ నచ్చకే తాము రాజీనామాల ద్వారా నిరసనలు వ్యక్తం చేశామని విలేఖర్లకు తెలిపారు. చైర్మన్ విధానాలు వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన జన్మభూమిలో పాల్గొన్న చైర్మన్ ఎక్కడాకూడా పార్టీ ప్రస్థావన తేకపోవడం గమనార్హమన్నారు. టిడిపికి చెందిన వైస్ చైర్మన్ హన్నుతో సంబంధాలు పెట్టుకుని కాంట్రాక్టులు అన్నీ ఆయన కొడుక్కే దక్కే విధంగా చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు తమకు నచ్చలేదని మెట్ల గోపి తీవ్రంగా ధ్వజమెత్తారు. గత రెండు నెలలుగా అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు రాజీనామాల ద్వారా చైర్మన్‌కు తమ నిరసనలు తెలిపారు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు చైర్మన్‌తో పాటు పట్టణ వైసిపి అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు విఫలయత్నం చేశారు.

కవులూరులో మంత్రి ఉమకు ఘనస్వాగతం
జి.కొండూరు, జనవరి 19: మండల పరిధిలోని కవులూరులో షాదీఖానా శంకుస్థాపనకు విచ్ఛేసిన మంత్రి ఉమకు టిడిపి సీనియర్ నేత భోగినేని రవీంద్ర, జువ్వా రాంబాబు, కృష్ణాజిల్లా తెలుగురైతు కార్యదర్శి గరిమెళ్ళ గోపాలరావు, డిసి చైర్మన్ బొర్రా అశోక్, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు, తాటికొండ భాస్కరరావు తదితరులు కవులూరులో మంత్రి ఉమకు ఘనస్వాగతం పలికారు. షాదీఖానాను నిధులు మంజూరు చేయించిన మంత్రి ఉమకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టిసీమ నీటితో పండించిన ధాన్యం నుంచి తీసిన కొత్తబియ్యంతో వండిన పాయసాన్ని మంత్రి ఉమకు తినిపించారు. ముందుగా ఎడ్లబండిపై గ్రామంలో భారీగా ఊరేగించారు. గోదావరి నీటి కారణంగా ఒండ్రుమట్టి వల్ల ఎకరానికి 5బస్తాల వరకూ ధాన్యం దిగుబడి పెరిగిందని సభలో మంత్రి ఎదుట రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఉమను గజమాలతో సత్కరించారు. శాలువాలు కప్పి సన్మానించారు. అప్పసాని వినీత్, జమ్ముల శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ నేతలు దస్తగిరి, గాలిసైదా, షాబాషి, వౌలాలి, ఖాదర్‌భాషా తదితరులు పాల్గొన్నారు.