కృష్ణ

ఆన్‌లైన్లో.. ఇంటర్వ్యూలకు రానివారి పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 19: ఇంటర్వ్యూలకు హాజరు కాని వ్యక్తుల పేర్లను రుణాలు పొందేందుకు ఆన్‌లైన్ చేయటంపై గురువారం ఎంపిడివో పద్మసుధను ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 15న వివిధ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు పొందే లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు స్థానిక కెడిసిసి బ్యాంకుకు కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారని, కాని అదనంగా మరో ఏడుగురి పేర్లను ఏవిధంగా ఆన్‌లైన్ చేశారని, యూకోబ్యాంకు మేనేజర్ 19 మంది లబ్ధిదారులకు విల్లింగ్ ఇస్తే నిలుపుదల చేయమని ఎందుకు కోరారని ఎంపిపి నిలదీశారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఎంపిడివోని పిలిచి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడివో ముందే జెడ్పీ సీఈవోకి ఫోన్‌ద్వారా సదరు విషయాన్ని ఎంపిపి తెలియజేశారు. ఎంపిడివో పద్మసుధ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, గతంలో మీకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఎంపిపి అన్నారు. దాంతో ఇంటర్వ్యూలకు హాజరుకాని పేర్లు ఆన్‌లైన్‌లో ఎందుకు చేర్చారో ఎంపిడివొ నుంచి లేఖ తీసుకొమ్మని సిఈవో సూచించారు. ఎంపిపి వివరణ లేఖ ఇవ్వమని అడగడంతో పద్మసుధ లేచి వెళ్ళి పోయారు. అనంతరం ఎంపిపి విలేఖరులతో మాట్లాడుతూ ఎంపిడివో పద్మసుధ నకిలీ బిల్లులు పెట్టి సుమారు రూ.5లక్షల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిగినా, సీఈవో ప్రత్యేక విచారణ జరిపించినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంత అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన విషయంపై పత్రికల్లో ఆధారాలతో సహా వచ్చినా పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఎంపిపి ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయానికి వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారని, ప్రజల సేవలకు అందుబాటులో కూడా ఉండటంలేదని తెలిపారు. ఇలాంటి ఎంపిడివోకి ఎలాంటి రాజకీయ శక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారో అధికారులు తెలపాలన్నారు.. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఎంపిడివోను వెంటనే సస్పెండ్‌గాని, ఇక్కడ నుంచి బదిలీగానీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపిడివో చేసిన అవినీతి విషయంపై మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలను తీసుకుని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.