కృష్ణ

లబ్ధిదారుల జాబితా పంపేందుకు జన్మభూమి కమిటీ సభ్యుల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 20: లబ్ధిదారుల జాబితాలను 35 రోజుల నుంచి ఆయా కార్పోరేషన్‌లకు పంపించటంలో అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల చివరి రోజైన శుక్రవారం జన్మభూమి కమిటీ సభ్యులు హైరానా పడాల్సి వచ్చింది. శుక్రవారం ఎంపిడివో ఎస్‌ఈ పద్మసుధ మండల పరిషత్ కార్యాలయానికి రాకపోవటంతో జన్మభూమి కమిటీ సభ్యులు వీరపనేని శివరాంప్రసాద్, కళ్ళం సాంబశివారెడ్డి, వల్లూరు సుదర్శనరావు, పాములలంక సర్పంచ్ పాముల శ్రీనివాసరావు, రొయ్యూరు ఎంపిటిసి మూడే శివశంకర్, జిల్లా టిడిపి బీసీసెల్ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, కళ్ళం వంశీకృష్ణరెడ్డి పలువురు టిడిపి నాయకులు కారులో విజయవాడ వెళ్లి జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధను కలిశారు. డిసెంబర్ 15న వివిధ కార్పోరేషన్ రుణాలకు లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు జరిగితే ఇంత వరకు తుది జాబితా సిద్ధం కాలేదని, దీనికి ఎంపిడివో వ్యవహరిస్తున్న తీరే కారణమని తాము ఫిర్యాదు చేసినట్లు జన్మభూమి కమిటీ సభ్యులు తెలిపారు. లబ్ధిదారుల జాబితాలపై ఇంకా ఎంపిడివో సంతకం చేయాల్సి ఉందని సర్పంచ్ శ్రీనివాసరావు చెప్పారు. దాంతో గద్దె అనురాధ ఎంపిడివోతో ఫోన్‌లో మాట్లాడగా తాను కార్యాలయానికి వస్తానని చెప్పడంతో వారంతా మండల పరిషత్ కార్యాలయం వద్ద జాబితాలు పట్టుకుని సాయంత్రం 5 గంటల వరకు పడిగాపులు కాశారు. ఫోన్ చేస్తే వస్తున్నానని చెబుతున్నా జాబితా సమర్పించాల్సిన పుణ్యకాలం పూర్తవుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక నానా హైరానా పడ్డారు. ఎంపిడివో వచ్చి సంతకం చేయకుంటే తమపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు రుణాలు ఇప్పించలేని దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదేవిధమైన పరిస్థితులు ఏర్పడటంతో రూ.1.32 కోట్ల రుణాలు ఎవరికి దక్కకుండా వెనక్కి వెళ్లిపోయిన నేపథ్యంలో ఎంపిడిఓ తీరుపై అధికార టిడిపి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల ప్రత్యేక బీట్‌లు
మోపిదేవి, జనవరి 20: ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు అవనిగడ్డ సిఐ ఎస్‌వివిఎస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఏకకాలంలో ప్రత్యేక బీట్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ సిఐ మూర్తి మోపిదేవి గ్రామ కూడలిలో, అవనిగడ్డ ఎస్‌ఐ మణికుమార్ చల్లపల్లికి వెళ్లే జాతీయ రహదారిపై, కోడూరు ఎస్‌ఐ వి సుధాకర్ అవనిగడ్డ వైపు వెళ్లే జాతీయ రహదారిపై, నాగాయలంక ఎస్‌ఐ కెవిరెడ్డి మోపిదేవి టెలికామ్ సెంటరు వద్ద ప్రత్యేక బీట్‌లు నిర్వహించారు. వందలాది వాహనాలను తనిఖీచేసి 60 కేసులు నమోదు చేశారు. తద్వారా రూ.11వేలకు పైగా జరిమానాలు రూపంలో వసూలు చేసినట్లు అవనిగడ్డ సిఐ మూర్తి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానిది కర్షక, కార్మిక వ్యతిరేక విధానం
బంటుమిల్లి, జనవరి 20: దేశ వ్యాప్తంగా కార్మిక, కర్షక పిలుపు మేరకు శుక్రవారం బంటుమిల్లి లక్ష్మీపురం సెంటరులో కార్మిక, కర్షక మైత్రి సభ సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. సభకు మాజేటి శివ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. తూర్పు కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి రానున్న బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. పోసిన మోహనరావు మాట్లాడుతూ దేశంలో 40 శాతం వరకు నిరక్షరాస్యులు ఉన్నారని, అందువల్ల పూర్తి స్థాయిలో నగదు రహిత సేవలు అమలు చేయడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పొదిలి వెంకన్న, కల్యాణం నాగ నరసింహరావు, కూనపరెడ్డి నాగరాజు, ఆకునూరి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, తోట ఆంజనేయులు, సుంకర వెంకన్న, పత్తి భోగేశ్వరరావు, బొడ్డు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.