కృష్ణ

మానసిక వికాసానికి క్రీడలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 21: మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఎంపిపి బాణావతు లక్ష్మి అన్నారు. నూజివీడు డివిజన్ పరిధిలోని 80వ గ్రిగ్ మెమోరియల్ బాలికల ఆటల పోటీలు స్థానిక ఎస్‌ఎస్‌కే ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె పోటీలను ప్రారంభించిన అనంతర ప్రసంగించారు. విద్యార్థులకు చదువుతోపాటు ఆటల పోటీలు కూడా అవసరమేనన్నారు. పోటీతత్వంతోనే ప్రతిభ మెరుగవుతోందన్నారు. నూజివీడు డీవైఈఓ డి రవీంద్రనాయక్, ఎంఇఒ ఎల్ బాలు, పిడి రవికుమార్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, అప్సా జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి మోహనరావు, ఎస్‌ఎస్‌కే ప్రిన్సిపాల్ ఎం జాన్ లాజరస్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థినులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, సాఫ్ట్‌బాల్, చెస్, బాల్ బాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఈపోటీలలో గెలుపొందిన జట్లు ఈనెల 27, 28, 29 తేదీలలో ఉయ్యూరులో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని ఎంఇఓ తెలిపారు. అండర్-14, అండర్-17 స్థాయిలలో ఈపోటీలు నిర్వహించారు. కాగా ఈపోటీలలో విజేతలైన విద్యార్థినిలకు ఎస్‌ఎస్‌కే ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్, అప్సా జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి మోహనరావు తన సొంత ఖర్చుతో బహుమతులు అందించారు.
ఒలింపియాడ్ పరీక్షల్లో ‘కొమ్మారెడ్డి’ విజయకేతనం
బంటుమిల్లి, జనవరి 21: సిన్స్ ఒలింపియాడ్ హైదరాబాద్ వారు ఇటీవల నిర్వహించిన దేశ వ్యాప్త పరీక్షల్లో బంటుమిల్లి కొమ్మారెడ్డి టాలెంట్ హైస్కూల్‌కు చెందిన 23 మంది నేషనల్ లెవల్ పరీక్షకు ఎంపికయ్యారు. మొత్తం 53 మంది ఈ పరీక్షలకు హాజరు కాగా 23 మంది ఎంపిక కావడం విశేషం. దేశ వ్యాప్తంగా 453 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఓఎమ్‌ఎస్ ఒలింపియాడ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్‌లను కొమ్మారెడ్డి విద్యార్థుల సాధించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓఎమ్‌ఎస్ అకాడమీ ఆల్ ఇండియా స్థాయిలో సైన్స్ ఒలింపియాడ్ పరీక్షలకు ఈ పాఠశాల నుండి 38 మంది విద్యార్థులు పాల్గొనగా ఎస్ సాయి కీర్తి ఆల్ ఇండియాలో 11వ ర్యాంక్, ఎం లావణ్య 17వ ర్యాంక్ సాధించారు. అదే విధంగా 500 లోపు ర్యాంక్‌లు సాధించిన వారు ఆరుగురు, వెయ్యి లోపు ర్యాంక్‌లు సాధించిన వారు 18 మంది ఉన్నారు. వీరిని కొమ్మారెడ్డి టాలెంట్ హైస్కూల్ డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అభినందించారు.