కృష్ణ

జాతీయ విపత్తులపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, జనవరి 21: మండల పరిధిలోని పోడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో తీర ప్రాంతాలలో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కొవాలో అనే అంశాలపై జాతీయ విపత్తు స్పందన దళం సిబ్బంది శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 10వ బెటాలియన్ టీమ్ కమాండర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదలు, భూకంపాలు సంభవించినప్పుడు వృద్ధులు, బాలింతలు, చిన్నారులను ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. విపత్తులు రాకముందు, వచ్చిన తరువాత తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది 30 మంది, సర్పంచ్ బస్వాని బంగార్రాజు, నీటి సంఘం అధ్యక్షుడు బొర్రా ఏడుకొండలు, విద్యా కమిటీ చైర్మన్ వేముల హరిబాబు, విఆర్‌ఓ నాగమల్లేశ్వరరావు, విఆర్‌ఎ మరియదాసు, విద్యార్థులు పాల్గొన్నారు.
బేస్‌బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక
గన్నవరం, జనవరి 21: రాష్ట్ర స్థాయి జూనియర్ బేస్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు శనివారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో జరిగాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి దాదాపు 100 మంది క్రీడాకార్లు పాల్గొన్నారు. పాఠశాల హెచ్‌ఎం దివి జవహర్‌లాల్ ఎంపికలను ప్రారంభించారు.
బాలుర జట్టు
కేవివిఎన్‌వి ప్రసాద్, కెవివి నాగమల్లేశ్వరరావు (జెడ్పీహెచ్‌ఎస్ మోపిదేవి), పి విశ్వతేజ, టి లక్ష్మణరాజు, (నిర్మలా హైస్కూల్ విజయవాడ), టి రవితేజ (మోపిదేవిఙ, ఎం అజయ్ సంపత్ (వేలేరు), ఎస్ రాహుల్ (మోపిదేవి), వై పృధ్వీ (ఆత్కూరు), జి నవీన్ (తేలప్రోలు), జె వినయ్‌బాబు, ఎన్ శ్రీనివాసరావు(వేలేరు), ఎస్ గణేష్ (సెయింట్ జాన్స్ గన్నవరం), ఎస్‌కె రెహమాన్ (బాపులపాడు), ఎంవిఎస్ వేణుగోపాల్ (శ్రీ చైతన్య), ఏ శివప్రసాద్ (గన్నవరం) ఎంపికయ్యారు.
బాలికల జట్టు
ఎన్ సాహితి, యు శిరీష, ఎన్ నందిని, పి నీలిమ, పి పూజిత (జెడ్పీహెచ్‌ఎస్, మోపిదేవి), టి జయశ్రీ, కె అనూష, పి పావని (తేలప్రోలు), ఎస్ పూర్ణిమ, పి అచ్చాబి, వి నవ్య, జి శేషారాణి (ఆత్కూరు), డి ఝాన్సీ, వి శివపార్వతి, జి రవిత (వేలేరు), ఎం విజయకుమారి (కోడూరు) ఎంపికయ్యారు. ఎంపికైన బాలబాలికల జిల్లా జట్లు ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ బేస్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో కృష్ణాజిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కృష్ణాజిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎంవి సత్యప్రసాద్ తెలిపారు. పిఈటిలు సుబ్బారావు, రామచంద్రుడు, నాగరాజు, వి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.