కృష్ణ

వెనుకబడిన గ్రామాల పరిశీలనకు కేంద్ర బృందం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జనవరి 21: వెనుకబడిన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారుల బృందాన్ని మొవ్వ మండలానికి పంపించింది. మండలంలో వెనుకబడిన గ్రామాలను గుర్తించేందుకు కేంద్ర అధికారులు ఓ శివశంకర్, కె మల్లేశం శనివారం మొవ్వ ఎంపిడిఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని కూచిపూడి, కాజ, చినముత్తేవి, బార్లపూడి, అవిరిపూడి, నిడుమోలు, పెదముత్తేవి, పెడసనగల్లు, యద్దనపూడి గ్రామాలలో పన్నుల వసూళ్లు, అభివృద్ధి, వౌలిక సదుపాయాలు, రహదారులు తదితర అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఆయా గ్రామాలలో పర్యటించి సేకరించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఇఓపిఆర్‌డి కెవిఎస్ శర్మను సంబంధిత గ్రామాల రికార్డులను సేకరించారు. ఈ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, వెలుగు లీడర్లు, డ్వాక్రా మహిళలు, 10 మంది గ్రామస్థుల నుండి విడివిడిగా వివరాలు సేకరించి తమ శాఖకు అందచేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఓటు హక్కుపై అవగాహన సదస్సు
మోపిదేవి, జనవరి 21: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఓటు హక్కుపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బందరు ఆర్డీవో సాయిబాబు ఓటు విలువను తెలియజేశారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ ఎంవి సూర్యనారాయణ, హెచ్‌ఎం కె ఉమామహేశ్వరరావు, ఎలక్షన్ డిటి సాయికృష్ణ కుమారి, ఆర్‌ఐ జగన్మోహనరావు, ఉపాధ్యాయులు శివ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.