కృష్ణ

కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 21: రవాణా రంగంలో అధిక ఫీజుల రూపంలో కార్మికులపై పెనుభారం మోపుతున్నారని పలువురు ఆటో కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో, టాటా మేజిక్, టాక్సీ, లారీ ఇతర మోటారు వాహనాలపై పెంచిన ఫీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మచిలీపట్నం ఆటోవర్కర్స్ యూనియన్, అభ్యుదయ టాటా మేజిక్ వర్కర్స్ యూనియన్ (ఎఐఎఫ్‌టియు- న్యూ) ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అంతులేని భారాన్ని మోపుతున్నాయని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఆటో, టాటా మేజిక్, టాక్సీ, లారీ తదితర వాహనాలపై డ్రైవింగ్ లైసెన్సులు, అర్సీలు, ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లు, రెన్యువల్స్ ఫీజుల మొత్తాన్ని అమాంతం పెంచేశారన్నారు. ఈ పెంపు దుర్మార్గమన్నారు. పెంచిన ఫీజులను తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి వెంకట్రామయ్య, కె శాంతిబాబు, కె నాంచారయ్య, పి కాంచారయ్య, పి నాగమల్లేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.