కృష్ణ

చల్లపల్లిలో ఆహ్లాదకరంగా హ్యాపీ సండే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జనవరి 22: స్వచ్ఛ చల్లపల్లి ఆధ్వర్యంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆట పాటలతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఎటియం సెంటరు వద్ద ఉదయం 6గంటల నుండి 8గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం పుర ప్రజలను ఆకట్టుకుంది. విజయ అకాడమీకి చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. నెల్లూరుకు చెందిన డా. బి రాజేశ్వరరావు, డా. ఎంవి రమణయ్య, బి శ్రీనివాసరావు, జి కామయ్య, భీమవరం విష్ణు డెంటల్ కళాశాల ప్రొఫెసర్ డా. ఎస్ సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలను అసాంతం వీక్షించి నిర్వాహకులను అభినందించారు. స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డా. డిఆర్‌కె ప్రసాద్, పద్మావతి దంపతులను అభినందించారు. హ్యాపీ సండే నిర్వహణకు విజయ అకాడమి ప్రిన్సిపాల్ నాగళ్ల భీమారావు తమ వంతు సాయంగా రూ.10వేలు విరాళాన్ని ‘మన కోసం - మనం ట్రస్టు’కు అందజేశారు. అలాగే విశ్రాంత ఉద్యోగి పాటూరి శాస్ర్తీ ప్రతి నెలా అందించే విరాళానికి తోడు రూ.5వేలు నగదు అందించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు దాసరి రామ్మోహనరావు, స్వర్ణలత దంపతులు అందించిన వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి కృష్ణ కుమారి, సర్పంచ్ కట్టా పద్మావతి, డిసి చైర్మన్ నిడమానూరి దిలీప్ కుమార్ అధికార, అనధికార ప్రముఖులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉత్సాహంగా 2కె రన్
అవనిగడ్డ, జనవరి 22: దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంత్యుత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2కె రన్ ఉత్సాహంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను అవనిగడ్డ ఎస్‌ఐ మణి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. యువకులు పెద్ద ఎత్తున పాల్గొనగా రాయన నాగ మణికంఠ కుమార్, లంకే సాయి కుమార్, పులవర్తి సన్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. వ్యాయామోపాధ్యాయులు కె పూర్ణచంద్రరావు, నాగ గోపాల్ పోటీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జివి నగరాయులు, భోగాది చంద్రశేఖర్, ఎస్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

రామాయణం, భగవద్గీతల సారాన్ని పిల్లలకు చెప్పాలి
గుడివాడ, జనవరి 22: రామాయణం, భగవద్గీతల సారాన్ని చిన్ననాటి నుండే పిల్లలకు వివరించాలని శ్రీఅహోబిల జీయర్ స్వామీజి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం స్థానిక జగన్నాథపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారిని స్వామీజి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు స్వామీజికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామీజి భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు రామాయణం, భగవద్గీతలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామినేని బాబూరాజేంద్రప్రసాద్, ఆలయ అర్చకులు శ్రీమాన్ వేదాంతం అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు.