కృష్ణ

మొవ్వ మండలానికి శుద్ధి చేసిన మంచినీరు ఎండమావేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జనవరి 22: మొవ్వ మండలంలోని మారుమూల గ్రామాలతో పాటు పామర్రు నియోజకవర్గం పరిధిలోని మొవ్వ, పామర్రు, పెదపారుపూడి మండలాల్లోని గ్రామాల ప్రజల అవసరార్ధం కృష్ణానది నుండి శుద్ధి చేసిన మంచినీటి కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రూ.72కోట్ల అంచనాలతో 2013 మే నెలలో శంకుస్థాపన చేసిన ఈ పథకం ద్వారా యేటా మంచినీటి కోసం ప్రజలు ఎదురుచూడటం అలవాటుగా మారింది. ఈ యేడాది అయినా శుద్ధి చేసిన కృష్ణానది నీరు తాగే అవకాశం ఉందా.. లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రెండు సంవత్సరాలుగా ఈ పథకం పనులు నత్తనడకగా సాగుతుండటంతో ఏడాదిలోపు పూర్తికావల్సిన పథకం ఇప్పటి వరకు పూర్తికాకపోవటం విశేషం. మొవ్వ మండలంలోని పద్దారాయుడుతోట శివారు రాచర్లపాలెం, కోళ్లపాలెం, కాజ శివారు మట్లమాలపల్లి, కళాయిగుంట, మందపాలెం, మంత్రిపాలెం శివారు మాకులవారిపాలెం, నిడుమోలు శివారు వీరాయలంక, మల్లేశ్వరం, ఎస్టీ కాలనీలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు గత శాసనసభ్యుడు డివై దాస్ చొరవతో రూ.72కోట్ల ఆర్‌డబ్ల్యుఎస్ నిధులతో ఈ నిర్మాణం ప్రారంభించారు. ఈ పథక నిర్మాణానికి తొలి సారిగా ప్రభుత్వం రూ.24కోట్లు విడుదల చేసింది. వీటితో అయ్యంకిలో ఫిల్టర్‌బెడ్, ఓవర్‌హెడ్ ట్యాంక్, కృష్ణానదిలో రిజర్వాయర్, తోట్లవల్లూరు మండలంలో పంపింగ్ హౌస్ నిర్మాణాలు జరిగాయి. తదుపరి విడుదల చేసిన రూ.16కోట్లతో పైపులైన్‌ల నిర్మాణం చేపట్టారు. అయితే పెదపూడి, అయ్యంకి గ్రామాలలో బీమనది డ్రెయిన్, ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెన నిర్మించాల్సి రావటంతో పైపులైన్ నిర్మాణం ఆలస్యమైనా గత ఏడాది పూర్తిచేసి మార్చి నెల నుండి మంచినీటి సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పేర్కొన్నారు. అయితే నేటి వరకు మొవ్వ మండలంలోని ప్రజల అవసరార్ధం గుక్కెడు నీరు కూడా సరఫరా కాలేదు. దీనిపై మొవ్వ ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ సిహెచ్ సుబ్బారావును వివరణ కోరగా ఈ ఏడాది పామర్రు మండలంలోని పోలవరం, ఉండ్రపూడి, ఎస్సీ కాలనీ, రాపర్ల, ఎస్సీ కాలనీ, జమీదగ్గుమిల్లి, కూర్మాపురం, యాదవపురం గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే పథకానికి సంబంధించిన ప్రధాన నిర్మాణాలు మొవ్వ మండలంలో జరిగినా ఈ మండలంలోని మారుమూల ప్రాంతాలకు మాత్రం ఒక గుక్కెడు నీరు కూడా సరఫరాకాకపోవటం విశేషం. కాగా గత పది రోజులు నుండి వాతావరణంలో వేడి క్రమేపి పెరుగుతోంది. ఫిబ్రవరి 3వ తేదీ రథసప్తమి నుండి సూర్యుడు ప్రతాపం చూపే అవకాశం ఉంది. 24వ తేదీన మహాశివరాత్రి నుండి ఎండ వేడిమి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు. మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేదలు సైతం మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పద్దారాయుడుతోట శివారు రాచర్లపాలెంలో గుక్కెడు మంచినీరు అందకపోవటంతో గ్రామ శివారు ప్రాంతంలోని బావిలోని ఉప్పునీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చేనేత కార్మికులు వాపోతున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అధికారులు పథక నిర్మాణాన్ని అంకితభావంతో చేపట్టి పూర్తి చేసి శివారుప్రాంత ప్రజలకు వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.