కృష్ణ

ప్రతి కార్యకర్తా ప్రజలతో మమేకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 23: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం స్థానిక అన్నం రాఘవరావు, రాఘవయ్య కల్యాణ మండపంలో బందరు మండల టిడిపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు తామంతా పని చేస్తామన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించకపోతే
ఆందోళన ఉద్ధృతం
* చలసాని శ్రీనివాసరావు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 23: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర మేథావుల ఫోరం నాయకులు చలసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఈనెల 23 నుండి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలోని కలెక్టర్ వారి కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేయుటకు పిలుపునిచ్చిందన్నారు. 15 రోజుల లోగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ వర్కింగ్ కన్వీనర్ పోతన వెంకట రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చిన్న మొత్తాల చెల్లింపునకు రూ.1100 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రతి నెల రూ.2వేల కోట్లకుపైగా తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు సూరత్ సురేష్‌బాబు మాట్లాడుతూ కుంభకోణానికి కారకులైన అగ్రిగోల్డ్ యాజమాన్యం, డైరెక్టర్‌లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా జాయింట్ కన్వీనర్ షేక్ ఆరీఫ్ పాషా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉప ప్రధాన కార్యదర్శి లింగం ఫలిప్, మోదుమూడి రామారావు, జిల్లా బాధిత కమిటీ అధ్యక్షుడు యండిహెచ్ రెహ్మాన్, కార్యదర్శి గిరి కుమార్, వై రామారావు తదితరులు పాల్గొన్నారు.