కృష్ణ

రోడ్డు ప్రమాదాల్లో జిల్లా నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత విశాఖ పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉండగా శ్రీకాకుళం 798 ప్రమాదాలతో చివరి స్థానంలో నిలిచింది. అయితే 2010 నుంచి గణాంకాలను పరిశీలిస్తే గత ఏడాది 2000కు పైగా ప్రమాదాలు తగ్గటం కొంత ఊరట కల్గిస్తోంది. జనవరి నుంచి నవంబర్ వరకు గల గణాంకాలను పరిశీలిస్తే 2010లో 24,496 ప్రమాదాలు జరుగ్గా 8,556 మరణాలు సంభవిస్తే 32,850 మంది గాయపడ్డారు. 2016లో 21,758 ప్రమాదాలు సంభవిస్తే 7,832 మరణాలు జరుగ్గా 27,872 మంది గాయపడ్డారు. ఇక 2016లో 2,223 ప్రమాదాల్లో 627 మరణాల్లో కృష్ణా, 1813 ప్రమాదాల్లో 580 మరణాలతో విశాఖ, 1790 ప్రమాదాల్లో 623 మరణాలతో తూ.గో జిల్లా వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ప్రమాదాలు తక్కువైనా మరణాల్లో గుంటూరు (711), చిత్తూరు (675), తూ. గో జిల్లా (623) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యత్తంగా 2,217 మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో ఏటా 15 లక్షల మంది పైగా ప్రాణాలు కోల్పోతుంటే మన దేశంలో సగటున లక్షా, 45వేల మంది మరణిస్తున్నారన్నారు. ఈ లెక్కన దేశంలో గంటకో ప్రమాదం జరుగుతుంటే రోజుకు 400 మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాల్లో ఎపి దేశంలో ఏడవ స్థానంలో ఉందన్నారు. డ్రైవర్‌కి అనుభవంలేమి, ఓవర్ లోడింగ్, రోడ్ ఇంజనీరింగ్‌తోపాటు అధికవేగం, మద్యం సేవించి వాహనం నడపటం, ప్రమాదకరమైన మలుపులు రహదారులపైనే వాహనాల పార్కింగ్, రహదారి భద్రతపై అవగాహన లేమి అందుబాటులో లేని ట్రామాకేర్ సెంటర్లు వంటి కారణాల వలన ఎందరో తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల వలనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రవేశపెట్టామన్నారు. 2020 నాటికి రోడ్డు ప్రమాదాలు 50 శాతం తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి రాఘవరావు చెప్పారు. బ్లాక్‌స్పాట్స్‌ను రిపేరు చేయడంతో పాటు ప్రతి 50 కి.మీ ఒక అంబులెన్స్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి వాహనానికి జిపిఎస్ పరికరాన్ని అమర్చడం ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించడం, స్పీడ్ గవర్నెన్స్ ద్వారా ప్రమాదాలను నియంత్రించేందుకు కూడా చర్యలు చేపట్టామని, ప్రతి చెక్‌పోస్ట్ వద్ద బ్రీత్ అనలైజర్ల ద్వారా డ్రైవర్లకు పరీక్షిలు నిర్వహించే యోచన చేస్తున్నామన్నారు. పోలీసు, రవాణా, రోడ్డు, వైద్య, విద్యాశాఖలు సమన్వయంతో పని చేయ గలిగితే రహదారి భద్రత మెరుగుపడుతుందన్నారు. కేరళ మాదిరిగా నోహెల్మెట్ - నో పేట్రోల్. కారులో ప్రయాణించేవారు విధిగా సీట్ బెల్ట్ నిబంధన అమలు చేయాల్సి ఉందన్నారు. ముఖ్యంగా తమ శాఖ ద్వారా ఈ దఫా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కళాజాత బృందాల ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య పరచడం, బైక్ ర్యాలీలు, లారీ డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు, హెల్మెట్ ధారణపై అవగాహన కాల్పించడం కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చే కార్యక్రమాలు చేపట్టామన్నారు.