కృష్ణ

రత్నకోడు డ్రైన్‌పై చెక్ డ్యామ్‌లు నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జనవరి 24: దివిసీమలో ప్రధాన డ్రైన్‌గా ఉన్న రత్నకోడ్ డ్రైన్‌పై అవసరమైన ప్రాంతాలలో చెక్ డ్యామ్‌లు నిర్మించటం ద్వారా పంటలను కాపాడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ నిపుణులు ఈ విషయమై పరిశీలన చేయాలని, విలువైన పంటలకు సాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా వర్షాలు లేనందున ఈ రకం చెక్ డ్యామ్‌లు నిర్మించాలని కోరారు. అలాగే ఎదురుమొండి దీవులకు సాగునీరు సరఫరా చేసేందుకు హైలెవల్ పిల్లర్స్ ఏర్పాటు చేసి పైపులైన్ నిర్మించాలన్నారు. అండర్ టెన్నల్స్ ఆధునీకరణలో భాగంగా నిర్మించ లేదని, ఇకనైనా అండర్‌టెన్నల్స్ నిర్మించాలని ఆయన కోరారు. పోలవరం నిర్మాణం జరగటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్మును స్వాహా చేసుకునేందుకే పోలవరం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పోలవరం ఊసే ఎత్తలేదని సింహాద్రి అన్నారు. ఇకనైనా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెక్ డామ్‌ల నిర్మాణం, పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రమేష్‌బాబు కోరారు. ఈ సమావేశంలో వైసిపి నేతలు రేపల్లె శ్రీనివాసరావు, రామదాసు, సింహాద్రి వెంకటేశ్వరరావు, సనకా అచ్యుత రామయ్య, సర్పంచ్ పృధ్వీరాజు తదితరులు పాల్గొన్నారు.

బేతవోలు హైస్కూల్లో జాతీయ బాలికా దినోత్సవం
గుడివాడ, జనవరి 24: స్థానిక బేతవోలులోని ఎస్‌జివిఎస్‌జి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పిఇటి బండి గోవర్ధనరావు ఆధ్వర్యంలో బాలికలకు పరుగు పందెం తదితర ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో బాలికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధనరావు మాట్లాడుతూ బాలికలు అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. ప్రతి ఏటా బాలికా దినోత్సవాన్ని నిర్వహించి బాలికలను చైతన్యం చేస్తామన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ధనలక్ష్మి, బంగారుతల్లి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బి ఇందిర తదితరులు పాల్గొన్నారు.