కృష్ణ

చిన్నారుల జీవితాన్ని మార్చే రెండు చుక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జనవరి 29: రెండు చుక్కలు చిన్నారుల జీవితాన్ని మారుస్తాయని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక గాంధీ క్షేత్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని బుద్ధప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని సూచించారు. మండల పరిధిలోని 28 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా దాదాపు 2వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, దేశం పార్టీ నేతలు మత్తి శ్రీనివాసరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాగాయలంక మండలంలో
90శాతం పల్స్ పోలియో కార్య్రకమం
నాగాయలంక, జనవరి 29: మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నాగాయలంక, సొర్లగొంది, ఎదురుమొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నాగాయలంక పిహెచ్‌సి పరిధిలో 1058, ఎదురుమొండిలో పిహెచ్‌సి పరిధిలో 1053, సొర్లగొంది పిహెచ్‌సి పరిధిలో 1185 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. నాగాయలంకలో డా. సరళ, ఎదురుమొండిలో డా. కె దమయంతి, సొర్లగొందిలో.. ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కల మందు వేశారు. కోడూరు మండలంలోని మందపాకల పిహెచ్‌సి పరిధిలో 334 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆయా పిహెచ్‌సి వైద్యాదికారిణి డా. లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన సూపర్‌వైజర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పిన్నమనేని కుమార్తె వివాహానికి విచ్చేసిన ముఖ్యమంత్రి
గుడివాడ, జనవరి 29: గుడివాడ ఏలూరు రోడ్డులోని వేములపల్లి కోదండరామయ్య కనె్వన్షన్‌లో ఆదివారం ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కుమార్తె వివా హ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచ్చేశారు. నూతన వధూవరులు ఉమాశ్రీ-రతన్‌లను ఆశీర్వదిం చి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాం తంలో ముఖ్యమంత్రి అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో హెలిప్యాడ్‌పై దిగారు. ప్రత్యేక బస్సులో వేములపల్లి కనె్వన్షన్‌కు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కొసరాజు వీరయ్యచౌదరి, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపిలు కొనకళ్ళ నారాయణ, మాగంటి బాబు, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ త చంటి, జడ్పీ చైర్‌పర్సన్ అనురాధ, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, ఉప్పులేటి కల్పన, కాగిత వెంకట్రావు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ రాజకుమారి, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి నందివాడ బాబు, ఆర్డీవో చక్రపాణి తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.