కృష్ణ

జిల్లాలో 93.7 శాతం పల్స్ పోలియో చుక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 29: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాలో 93.07శాతం పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ జరిగింది. మొత్తం 3లక్షల 77వేల 325 మంది 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు గాను 3లక్షల 53వేల 459 మందికి పోలియో చుక్కలు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 2లక్షల 10వేల 5 మంది చిన్నారులకు గాను 2లక్షల 8వేల 447 మంది (93.3%)కి పోలియో చుక్కలు వేశారు. అర్బన్ ప్రాంతాల్లో లక్షా 67వేల 320 మంది చిన్నారులకు గాను లక్షా 45వేల 12 మంది (86.7%) చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని, విజయవాడ నగర పాలక సంస్థలోని హైరిస్క్ ఏరియాల్లో బుధవారం కూడా పోలియో చుక్కలు వేస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కామేశ్వర ప్రసాద్ ఆదివారం రాత్రి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.