కృష్ణ

పింక్ కార్డుదారుల కోసమే ఆరోగ్య రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వం పింక్‌కార్డుదారుల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫిబ్రవరి 28 లోపు రూ.1200 కట్టి ఆరోగ్య రక్ష పథకంలో చేరాలని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గోపాలనాయక్ కోరారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మండలంలో 557 మంది పింక్‌కార్డుదారులు ఉన్నారని, అయితే ఇంత వరకు ఒక్కరు కూడా ఈ పథకంలో చేరలేదన్నారు. సరైన అవగాహన లేకపోవటంతో ఎవరూ ముందుకురాని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రూ.1200 ప్రీమియంతో రూ.2లక్షల వరకు వ్యక్తిగత ఆరోగ్యబీమా ఉంటుందని తెలిపారు. ఆరోగ్య రక్షలో చేరితే ఏప్రిల్ 7వ తేది నుంచి ఎన్‌టిఆర్ వైద్యసేవలో అనుమతి ఉన్న ఆస్పత్రులలో1044 వ్యాధులకు ఏడాదిలో రూ.2లక్షల వరకు వైద్యం చేయించుకోవచ్చని గోపాలనాయక్ చెప్పారు. ఆన్‌లైన్‌లో గాని, పీహెచ్‌సీలో ఉన్న వైద్యమిత్ర వద్దకు వచ్చిగాని ఆరోగ్య రక్షలో చేరాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైద్యమిత్ర జి గురవయ్య పాల్గొన్నారు.
నేటి రథసప్తమికి భారీ ఏర్పాట్లు
అవనిగడ్డ, ఫిబ్రవరి 2: మండల పరిధిలోని వేకనూరులో శ్రీ ఉషా, ఛాయాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించనున్న రథసప్తమి మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి విశేష అభిషేకాలు, అలంకారాలు, శాంతి కల్యాణం, అన్నసమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్త తుంగల వీరవసంతరావు తెలిపారు. సాయంత్రం 4గం.లకు గ్రామోత్సవం జరుగుతుందన్నారు. అభిషేక కార్యక్రమంలో పాల్గొనదలచినవారు ఆలయ ప్రధాన అర్చక స్వామి నరసింహమూర్తిని సంప్రదించాలని కోరారు.