కృష్ణ

మహిళా సాధికారతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఫిబ్రవరి 2: మహిళా సాధికారతే లక్ష్యంగా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన 2కె రన్‌ను స్పీకర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా గుడివాడ ఆర్డీవో ఎం చక్రపాణి స్పీకర్‌కు ఘనస్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గాల్లోకి బెలూన్స్‌ను ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ కోడెల మట్లాడుతూ గుడివాడ ప్రాంతానికి చెందిన అనేక మంది అన్ని రంగాల్లో ముందుంటూ వస్తున్నారన్నారు. కుటుంబ పోషణలో సగభాగం ఉన్న మహిళలు కూడా అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళల ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి కుటుంబం తప్పనిసరిగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రుణాలను అందజేస్తోందన్నారు. నరసరావుపేటలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించి దేశంలోనే మొదటిస్థానంలో నిలిపామని గుర్తుచేశారు. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు అమరావతిలో ఈ నెల 10, 11, 12తేదీల్లో జరిగే సదస్సులను జయప్రదం చేయాలన్నారు. ఈ సదస్సులకు వివిధ రంగాల్లో నిష్ణాతులు విచ్చేసి విలువైన సందేశాలను ఇస్తారని చెప్పారు. అనంతరం 2కె రన్‌లో స్పీకర్ డాక్టర్ కోడెల స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, తహసీల్దార్ అబ్దుల్ రెహ్మాన్, కమిషనర్ బండి శేషన్న, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

భవిష్య నిధి పథకంలో చేరాలి
* ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 2: ప్రైవేట్ సంస్థలలో పని చేస్తూ ఇప్పటి వరకు భవిష్య నిధిలో నమోదు చేసుకోని ఉద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రాంతీయ భవిష్యనిధి సంస్థ కమిషనర్ ఎకె మండల్ అన్నారు. స్థానిక బాలాజీ విద్యాలయంలో గురువారం గుంటూరు ఎంప్లారుూస్ భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎఫ్ కమిషనర్ మండల్ మాట్లాడుతూ 2009 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి 2016 డిసెంబరు 31వ తేదీలోపు పని చేస్తూ పిఎఫ్ లేని వారందరూ మార్చి 31వ తేదీలోపు సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద నమోదు చేసుకునే వారికి ఉద్యోగి వాటా నుండి మినహాయింపు ఉంటుందని, కానీ యాజమాన్యానికి ఎటువంటి పెనాల్టీలు, పరిపాలన ఖర్చులు ఉండవన్నారు. ఈ పథకం కింద చేరే యాజమాన్యాలు స్వచ్ఛందంగా ఇచ్చే డిక్లరేషన్‌పై ఎటువంటి విచారణ, ఎటువంటి తనిఖీలు జరగవని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రోజ్ గార్ ప్రోత్సాహన్ యోజన పథకాన్ని రూపొందించిందని తెలిపారు. పథకంలో చేరే వారి జీతాల నుండి సంస్థ అధిపతులు 12 శాతం చొప్పున మినహాయించి ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటరన్ ద్వారా మార్చి నెలాఖరు లోపు చెల్లించాలన్నారు. 10 సంవత్సరాలు పాటు ఉద్యోగులు సభ్యత్వంలో ఉంటే అనంతరం పెన్షన్ చెల్లిస్తామన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. విజయవాడ రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి టి శ్రీ్ధర్ వివిధ సంస్థల అధిపతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షుడు వి సుందరరాం, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, వివిధ విద్యా సంస్థల అధిపతులు పాల్గొన్నారు.